-
-
బోయకొట్టములు పండ్రెండు
Boyakottamulu Pandrendu
Author: Karanam Balasubramanyam Pille
Publisher: Karanam Balasubramanyam Pille
Pages: 297Language: Telugu
Description
ఇది క్రీ.శ. 624 నుండి 848 వరకు విస్తరించిన తెలుగు చరిత్ర.
ఇన్నూరు సంవత్సరాలలో ఆవిర్భవించి అభివృద్ధి చెంది ఒక వెలుగు వెలిగి
కేవలం ఒకనాటి యుద్ధములో శాశ్వతముగా రూపుమాసిన బోయకొట్టముల చరిత్ర.
ఈ నవలలోని ఇతివృత్తం కావ్యేతివృత్తం. భాష కావ్య భాష. శైలి కావ్య శైలి. కల్పనలు కావ్య కల్పనలు.
ఇది తెలుగువారు తప్పక చదవ వలసిన వచన మహాకావ్యం.
Preview download free pdf of this Telugu book is available at Boyakottamulu Pandrendu
నవల ఇతివృత్తం చాలా బావుంది. ఇందులో ఏడు తరాల కథని చాలా నేర్పుగా రచించారు.
ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఘట్టం పొన్ని-వకుళ ప్రేమ కథ. ఇందులోని వకుళ పాత్ర నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది.
6-8 వ శతాబ్దం మన తెలుగు చరిత్రని రూపుమాపింది. తెలుగు సాహిత్యానికి పునాది ఏర్పడింది ఆ కాలంలోనే. ఈ నవలలో మన తెలుగు సాహిత్యం ఎలా పరిణామం చెందిందో అది విశద పరిచారు.
మన తెలుగు రెండు మహా సామ్రాజ్యాలు, వేంగీ చాళుక్యులు మరియు పల్లవులు, పాలించారు. వీళ్ల రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ రెంటి రాజ్యాల మధ్య నలిగిపోయిన బోయిల చరిత్ర వృత్తాంతమిది.
తెలుగు లిపికి ఆనవాలుగా నిలిచిన అద్దంకి శాసనంలోని బోయకొట్టములు పండ్రెండుని ఆధారంగా తీసుకుని రచించిన దృశ్యకావ్యం ఇది.
అద్భుతమైన నవల...తెలుగు భాషాభిమానులందరూ తప్పక చదవవలిసిన పుస్తకం
బోయ దొరల వీరత్వం, పల్లవ, చాళుక్య రాజుల రాజ్యకాంక్ష, సంఘ సంస్కరణ, తెలుగు కవిత పరిణామం, మరెన్నో కళ్లకు కట్టినట్టు వర్ణన