• Bommalu Geeyadam Yenduku Nerchukovali
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బొమ్మలు గీయడం ఎందుకు నేర్చుకోవాలి

    Bommalu Geeyadam Yenduku Nerchukovali

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చిత్రకళ పట్ల మనలో చాలామందికి సద్భావం లేదు. చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బొమ్మలు గీయడం ద్వారా చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని బొమ్మలు గీసే పిల్లల్ని తిట్టడం సర్వసాధారణం. పిల్లలలోని సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహంచే తల్లిదండ్రులు అరుదు.

ఒక పిల్లవాడు ఒక బొమ్మ గీశాడు అంటే అతడు ఒక వ్యాసం రాసినట్లని ఎవరైనా భావిస్తారా? కానీ ఇది నిజం. ఎందుకంటే చిత్రకళ భావవ్యక్తీకరణకు ఉపయోగపడే ఒక భాష వంటిది. పది పేజీల వ్యాసం ఇవ్వలేని ఒక భావాన్ని ఒక చిత్రం ఇవ్వగలదు. అంటే ఒక చిత్రం పది పేజీల వ్యాసానికి సమానం. ఓనమాలు నేర్చుకోని పిల్లలు సైతం చిత్రకళ ద్వారా వ్యాసాలు రాయగలుగుతారని మనం గుర్తించాలి. ఇందులో వారి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు, వారి దృష్టిని ఆకర్షించిన అన్నీ అంశాలు వ్యక్తం అవుతాయి. అంతేకాక పిల్లల చిత్రాలలో వారి ప్రతిభ, సృజనాత్మకత, వారి నిశిత పరిశీలనా శక్తిని మనం దర్శించవచ్చు.

సృజనాత్మకత లేని సమాజం వెనుకబడిపోతుంది. నేడు అనేకానేక వినూత్న ఆవిష్కరణలన్నీ మనిషిలోని సృజనాత్మకత మూలంగా జరిగినవే. అలాంటి సృజనాత్మకతను మనం ఎలా అణచివేస్తున్నామో, విద్యార్థి భావి జీవితావసరాలకు అవసరమైన ఒక కళను, ఒక నైపుణ్యాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత బొమ్మలు గీయరాని విద్యార్ధులు పడే ఇబ్బందులు, చిత్రకళను అభ్యసించడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకొని తమ పిల్లల్ని నేనూ బొమ్మ గీయగలిగానని గర్వంగా తలెత్తుకొని నిలబడేలా అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.........

- బి. కిషోర్ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Bommalu Geeyadam Yenduku Nerchukovali