-
-
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
Bommalu Cheppina Kammani Kathalu
Author: Dr. Hari Sanath Kumar
Publisher: Self Published on Kinige
Pages: 104Language: Telugu
తొలి కాకతీయ ప్రభువులు జైనమతానుయాయులు. తరువాతకాలంలో శైవులుగా మారారు. అందుకే తొలిరోజుల్లో సృష్టించిన కాకతీయ శిల్పాలపై జైనమత ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. తరువాత కాలంలో జైనమతంపై ఆనాటి శిల్పాలపై శైవం విజృంభించింది. పర్యవసానంగా జైనం శైవం గుర్తించరానంతగా కలసిపోయాయి. ఈనాటికీ కాకతీయ ఆలయాల ద్వారబంధాల ప్రక్క గల పూర్ణ కలశాలు జైనుల ప్రతినిథులే. ఈ శైవంపై కొంతకాలానికి వైష్ణవం దాడి చేసింది. పర్యవసానం శివలింగ పానపట్టాలపై రంగనాయకస్వామి, చెన్నకేశవ స్వామి ప్రతిష్టించబడ్డారు. (వరంగల్ రంగశాయిపేటలో రంగనాయకస్వామి ఆలయం, వేంకటేశ్వర ఆలయం వీటికి నిదర్శనాలుగా మిగిలాయి) ఈ మతాల ప్రభావంతో ఆలయాలు ఆలయశిల్పాలు నిర్మించబడ్డాయి. ఈ శిల్పాలు నిర్మిస్తున్న శిల్పికి ఒకింత ధ్వని శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. వాచ్యంగా శిల్పాలు చెక్కుతున్నా అంతర్లీనంగా రహస్యంగా ఏదో గొప్ప కథను వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దానిని చరిత్ర పరిశోధకులు అధ్యయనం చెయ్యాలి. ఈ అధ్యయనానికి ఉపకరించేవి నాటి చరిత్రలు, శాసనాలు, ఈ అన్నింటినీ అన్వయించగలిగితేనే పరిపూర్ణమైన చరిత్ర వెలుగు చూస్తుంది.
