-
-
బొమ్మ వెనుక (మరికొన్నికథలు)
Bomma Venuka
Author: Janardhan Amballa
Publisher: Sampark Publications
Language: Telugu
జనార్దన్ కథలన్నిటా వారి జీవనతాత్త్వికత అంతఃసూత్రంగా గోచరిస్తూ వుంటుంది. అది - కృషి వుంటే మనుషులు ఋషులై, మహాపురుషులై- సమాజనిర్దేశకులవుతారనేదే! అలజడి నుంచీ జీవనపోరాటం నుంచీ మనిషితనం ఎగిసి నిలుస్తాయనేదే!
కుటుంబసంబంధాలూ, సామాజికసమస్యలూ, సంస్కృతిలో వచ్చిన వస్తున్న వైవిధ్యానికి ప్రేరకాలుగా తోడ్పడుతున్నాయి. జీవితమంత విస్తృతిని ఈ కథావైవిధ్యం ద్వారా చదువరులకందిస్తున్న అంబల్ల జనార్దన్ - తెలుగు కథాసాహితి కొక రేక!
--జె.ఎస్.మూర్తి(విహారి)
ఈ కథలలో 5 ప్రధాన లక్షణాలు పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. మొదటిది: జనార్దన్ బాల్యం నుంచి రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటున్న ఆయన ఆలోచనలో, అభివ్యక్తిలో తెలుగుదనం విస్తారంగా గుభాళిస్తుంది. రెండవది: అనుభవంలోకి వచ్చిన వాటిని, తెలుసుకున్న వాటిని ఆయన మొక్కవోని నిబద్ధతతో, ఉత్తమ సంవిధానంతో కథలుగా మలిచాడు. మూడవది: జనార్దన్ ఉన్నత పదవులు వహిస్తున్నా ఆయల కథలలో వలస బతుకుల వ్యధలు, బడుగుజీవుల ఇక్కట్లు, ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబిస్తాయి. నాల్గవది: ఈ కథలలో ఆశ్చర్యజనకమైన వస్తు వైవిధ్యం వ్యక్తమవుతుంది. జీవితాన్ని రచయిత అనూహ్యమైన కోణాల నుంచి దర్శిస్తాడు. బీడి కార్మికుల స్థితిగతులు, బాల కార్మిక వ్యవస్థ, విదేశీ కంపెనీల ఎత్తుగడలు, కార్యాలయాలలో పని ఎగవేత, మగపెళ్లి వారి ఆగడాలు, ముంబయిలో పేదల కష్టాలు, నగర జీవనంలో విచిత్ర సన్నివేశాలు... ఇలా ఎన్నో అంశాలను హృద్యంగా చిత్రించారు. అయిదవది: ముంబయి యాస, తెలంగాణా మాండలికం, శిష్ట వ్యావహారికాలను సమనైపుణ్యంతో ఈ కథలలో ఆయన ప్రయోగించారు.
-- గోవిందరాజు రామకృష్ణారావు.