-
-
బొజ్జా తారకం - నలుపు వ్యాసాలు
Bojja Tarakam Nalupu Vyasalu
Author: Bojja Tarakam
Publisher: Hyderabad Book Trust
Pages: 283Language: Telugu
Description
శ్రీ బొజ్జా తారకం గారి భావజాలాన్ని భావితరాలకు అందించవలసిన సామాజిక బాధ్యతతో “బొజ్జా తారకం ట్రస్ట్'ను ఏర్పాటు చేయటం జరిగింది. ట్రస్ట్ కార్యకలాపాలలో భాగంగా ‘నలుపు' పత్రికలో వారు రాసిన వ్యాసాలను పాఠకులకు అందిస్తున్నాం.
“నలుపు” పత్రిక ఒక విశిష్టమైన సామాజిక రాజకీయ వైజ్ఞానిక పత్రికగా పాఠకలోకంలో స్థానం పొందింది. ఆ పత్రికలో సమకాలీన సామాజిక రాజకీయ మత ధార్మిక సమస్యలపై తారకం గారు చేసిన విశ్లేషణలు, హెచ్చరికలు ఈనాటికీ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నాయి; పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవలసిన బాధ్యతను ఇప్పటికీ అవి గుర్తు చేస్తున్నాయి.
పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడే యోధునిగా తారకం గారి ఆలోచనలను ప్రతిఫలిస్తున్న ఈ వ్యాసాల సంకలనం పనిలో వివిధ దశలలో సహకరించిన - పాలుపంచుకున్న - మిత్రులందరకూ ధన్యవాదాలు.
- బొజ్జా తారకం ట్రస్ట్
Preview download free pdf of this Telugu book is available at Bojja Tarakam Nalupu Vyasalu
Login to add a comment
Subscribe to latest comments
