• Boggu Pulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బొగ్గుపూలు

    Boggu Pulu

    Publisher: Kakati Publications

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి నిరంతరం తనతో తను సంఘర్షిస్తుంటాడంటారు. నేనూ అంతే. ఈ సంఘర్షణే నన్ను విద్యార్థి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఉపాధ్యయవృత్తి, జర్నలిస్ట్ ఇలా పలు రంగాల్లో నన్ను నేను పరిచయం చేసుకోవలసి వచ్చింది. అయితే వీటన్నింటికంటే ముందే నన్ను బాల్యం నుండి వెంటాడింది నాటకం, కవిత, కథ. నా చిన్నతనంలో నాటకాలు రాసేవాన్ని. వాటిని వేదికల మీద ప్రదర్శించేవాన్ని.

ఎనిమిదవ తరగతిలో తొలి కవిత రాస్తే ఇంటర్‌లో తొలి కథ రాశాను. 1991లో తొలిసారి కలం పట్టినప్పుడు నా వయస్సు 12 ఏండ్లు. 2014 నాటికి తొలి కవితా సంపుటి 'స్వతంత్రసుమాలు' వేసేనాటికి తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగి స్వయంపాలన సాకారమైన సందర్భం. ఆ సందర్భంలో ఉద్యమ కవిత్వానికే జై కొట్టాను. కానీ ప్రస్తుత ఈ 'బొగ్గుపూలు' తీసే సందర్భం ఒక క్లిష్టమైన సందర్భం. నేను ఏదో సాధించాలని అనుకున్న ప్రతిసారి సరైన సహాకారం అందక కుప్పకూలిపోవడం ఎన్నిసార్లు జరిగిందో. అదే నన్ను మౌనమునిగా మార్చింది. బాధలో ఉన్నప్పుడు చిటికెడు ఓదార్పునిచ్చి ఒడిలో తలవాల్చుకోనిచ్చేతోడుకోసం తపించిన సందర్భాలెన్నో. ఆ బాధ, ఆవేశం, ఆవేదనలో ఉబికివచ్చిన కన్నీటి సెలయేటి తడికి ఊపిరిపోసుకుని పూసిన పూలే ఈ 'బొగ్గుపూలు'.

ఈ బొగ్గుపూలలో పూర్తిగా నలిగిన నా మనసే కనపడుతుంది. చుట్టూ జరుగుతున్న సంఘటనలు కూడా నా మనసును గాయపరిచినవే. ఆ గాయాలు రేపిన అలజడినే ఈ కవితాసంపుటికి శ్రీకారం.

- మధుకర్ వైద్యుల

Preview download free pdf of this Telugu book is available at Boggu Pulu