• Body Language
  • Ebook Hide Help
    ₹ 87.6
    97.2
    9.88% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాడీ లాంగ్వేజ్

    Body Language

    Publisher: Mohan Publications

    Pages: 132
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

''శరీరభాష'' అనేది పదిమందిలో మెలగవలసిన ప్రతివ్యక్తీ గ్రహించవలసిన విషయం. మనిషితో మాట్లాడకుండానే అతని ముఖకవళికలను బట్టి, వ్యవహరించే తీరునుబట్టి, అలవాట్లను బట్టి, చేసే విన్యాసాలను బట్టి అతడు ఎలాంటివాడో అతని మనస్థితి ఎలా ఉన్నదో గ్రహించడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది. 'శరీర భాష' అనేది ఒకటి వున్నది. దానిని రచయిత ఇందులో విడమరచే చెప్పారు. వారు పేర్కొన్న కొన్ని సంకేతాలు వాటి అంతరార్ధాలు ఇలా ఉన్నాయి.

''కాలుమీద కాలువేసుకొని కూర్చోవడం అహంకారానికీ, అభద్రతకు సూచన. చర్చలలో ఇలా కాలుమీద కాలువేసుకొని కూర్చోవడంతో చాలాసార్లు ఘర్షణలకు దారితీశాయి.''

''గడ్డం ఉన్నవారు దాన్ని దువ్వుతూ నిర్ణయం తీసుకుంటారు. లేనివారు చుబుకాన్ని పిడికట్లో పట్టుకొనిగాని, లేక పికిలితో చుబుకాన్ని తడుతూగాని నిర్ణయం తీసుకుంటారు. ఇందులో చూపుడువేలు క్రిందిపెదవి స్పృశించడం గానీ లేక క్రింది పెదవి క్రింద నిలపడంగానీ జరుగుతుంది. తక్కిన వేళ్ళన్నీ గడ్డానికి రెండు వైపుల క్రింద ఆనుకుంటాయి. హెన్రీసిడన్స్‌ దీనిని ''నిర్ణయం వైపుకు వెళుతున్న మేథావి'' గా వర్ణిస్తాం. సాధారణంగా; ఛెస్‌ ఆటగాళ్ళు ఈ భంగిమలోకి వస్తుంటారు.

''సిగరెట్ త్రాగేవారు త్వరగా ఒక పనిని ముగించి మరొక దానికి వెళదామని చూస్తారు. పైప్‌ త్రాగేవారు తాము ఎంతో సహనవంతులమనీ, సంప్రదాయ సంరక్షకులమనీ చెబుతారు. అలా నటిస్తారు''.

''మిమ్మల్ని సూటిగా చూడని వ్యక్తిఏదో దాస్తున్నాడని గ్రహించండి''. ''పదివేళ్ళ కొనలను ఒకచోట చేర్చి మందిర గోపురాకారం లోకి తీసుకురావడం ఒక భంగిమ. ఇది అహంకారాన్ని, దర్పాన్నీ, సొగసును, ఆధిక్యతను లేదా ప్రధానాచార్యత్వాన్ని ఇవన్నీ కూడిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Body Language