-
-
బోధాయన గృహ్యాసూత్రము
Bodhayana Gruhya Sutramu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 316Language: Telugu
బోధాయన గృహ్యాసూత్రము - మూలము
ఈ గ్రంథంలో బోధాయన గృహ్యాసూత్రంతో పాటు గృహ్యపరిభాష, గృహ్యశేషసూత్రాలు, పితృమేధసూత్రాలు, పితృమేధశేషం పొందు పరచబడ్డాయి.
ఈ గ్రంథం చాలా విలక్షణంగా ఉంటుంది. గృహస్థధర్మాన్ని అవలంబించినవాడు తప్పక చేయాల్సిన షోడశ సంస్కారాలను వివరిస్తూనే అనేక ధార్మిక విషయాలను తెలుపుతుంది. ధర్మాచరణలో కలిగే సందేహాలను తీరుస్తుంది.
ఉదా- ఏ గృహ్యశాస్త్రం పేర్కొనని ఉదకశాంతి అనే ప్రక్రియను ఇది వివరిస్తుంది. ఉదకశాంతిని వివాహము, ఉపనయనము, చౌళము, స్నాతకము, సీమంతము మొదలైన శుభకార్యక్రమములు చేయుటకు ముందు, షష్టిపూర్తి, భయయోత్పాత నివారణములు మొదలైన కార్యక్రమముల ముందు తప్పక ఆచరించాలి.
సంతానం లేనివారు సంతానానికి చేసే పుత్రకామేష్టిని ఏ విధంగా నిర్వర్తించాలో తెలుపుతుంది.
నక్షత్రదోషం వల్లనో గ్రహానుకూల్యత లేనందువల్లనో కలిగే బాధలు శాంతించటానికి చేయాల్సిన నక్షత్రహోమాన్ని, నవగ్రహ పూజావిధిని ఇది మంత్రపూర్వకంగా వివరిస్తుంది.
అరవై సంవత్సరాలు నిండిన సందర్భంలోను చేసే ఆయుష్యహోమము, ఇతర సందర్భాలలో చేసే ఉగ్రరథశాంతి, భీమరథశాంతి, సహస్ర చంద్ర దర్శనశాంతి మొదలైన వాటి విధానాన్ని చక్కగా వివరిస్తుంది.
విష్ణువు, రుద్రుడు, దుర్గ, లక్ష్మీ సరస్వతి, సూర్యుడు, వినాయకుడు మొదలైన దేవతలనర్చించే విధానాన్ని స్పష్టంగా వివరించి చెప్పుతుంది.
ఇంకా శ్రాద్ధము, దహన సంస్కారాలకు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు అనేక కార్యక్రమాలు ఏవిధంగా చేయాలో ఇది వివరిస్తుంది.
అందువల్ల శ్రద్ధాళువులైన ధార్మికులు ఇతర గృహ్య సూత్రాలలో కనిపించని అనేక విషయాలను ఈ గ్రంథం ద్వారా తెలిసికొని ఆచరించవచ్చు.

- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162