-
-
బోధాయన ధర్మ సూత్రము
Bodhayana Dharma Sutramu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 244Language: Telugu
బోధాయన ధర్మ సూత్రము
కృష్ణయజుర్వేదాంగమైన కల్పాన్ని రచించిన వారిలో బోధాయనుడు అగ్రగణ్యుడు. చాలా ప్రాచీనుడు కూడా. పైగా ఈ మహర్షి దాక్షిణాత్యుడు. అందువల్లనే కాబోలు దాక్షిణాత్యులలో బోధాయనులెక్కువగా కన్పించుచున్నారు. బోధాయన మహర్షి కల్పాంగమైన శ్రౌత సూత్రం, గృహ్యసూత్రం, ధర్మసూత్రం, కూడా రచించి భారతీయులకు పరమోపకారం చేసినాడు.
ధర్మసూత్రంలో బ్రహ్మచారి (విద్యను నేర్చుకొనువాడు) గృహస్థు (వివాహం చేసుకొని సామాజిక స్పృహతో ఉన్నవాడు) వానప్రస్థుడు (సంతానానికి ఇంటి బాధ్యతలప్పగించి విశ్రాంతి తీసికొనువాడు) మరియు సన్యాసి (ఐహిక విషయాల కంటే పారమార్థిక విషయాలకు ఆచరణలో ప్రాధాన్యతనిచ్చువాడు) ఆచరించాల్సిన వివిధ ధర్మాలను విపులంగా తెలిపినాడు.
పైగా ధర్మనిర్ణయం చేయాల్సిన ధర్మపరిషత్తు గురించి, తీర్పు చెప్పేడప్పుడు అనుసరించవలసిన పద్ధతి గురించి, స్త్రీల ఆస్తి గురించి వివరిస్తూ ఇంకా అనేక ప్రాయశ్చిత్తాలను తెలిపినాడు.
పుత్రసంతానం లేనివాడు తన కూతురు యొక్క పుత్రుని తీసుకొని అతనికి తన ఆస్తిని అప్పగించవచ్చునన్నాడు. ధర్మబద్ధంగ తీసుకొన్న ఆ మనుమని "పుత్రికా పుత్రు"డందురని తెలిపినాడు.
భగవంతునికి నివేదింపక, సాటివానికీ పెట్టక, తాను, తన కుటుంబము మాత్రము తినరాదని అన్నాడు. అతిథులకు, ఇంటిలోనున్న గర్భిణీ స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు, దీనులకు రోగగ్రస్తులకు భోజనము పెట్టిన తరువాతనే తాను భుజించాలని సామాజిక ధర్మాన్ని ఉపదేశించినాడు.
అధికమైన వడ్డీకి డబ్బు అప్పిచ్చి బ్రతుకువాడు నిందించతగినవాడని తెలిపినాడు.
తన సంసారాన్ని పోషించుకొనుచు యౌవనంలో ధార్మికుడుగా లేకపోయినప్పటికీ మలివయస్సులోనైనా ధార్మికక్రియలు తప్పక చేయాలని ఉద్బోధించినాడు.
ఈ విధంగా అనేకమైన ధార్మిక విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ గ్రంథం సర్వజనులకు పాఠనయోగ్యం.

- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162