-
-
బొడ్డుమల్లె చెట్టు
Boddumalle Chettu
Author: Annavaram Devender
Pages: 116Language: Telugu
కళ్ళల్లో జెకమొక మెరుపులు, ప్రకృతిలో విస్తరించిన పత్రహరితాలు, పోరాట పరిమళాలు గుప్పుమనడాలు, పురివిప్పిన రేశాలు, విల్లమ్ముల పొదల అసోయ్ దూలా ఆటలు, పైస మొలకలు, పుస్తక వికసన పురివిప్పడాలు, పలుగురాళ్ళు పదహారు పచ్చలైన వయస్కులు, తెల్లదొంగలు, మనిషి నిలువునా ఇచ్చుకపోవడాలు, బొగ్గు పెల్లలో పుట్టిన విద్యుత్ రేఖలు... ఇవన్నీ ఒక్కసారి చదవాలని వుందా? పదండి. అన్నవరం దేవేందర్ 'బొడ్డుమల్లె చెట్టు' దగ్గరికి వెళదాం.
అన్నవరం దేవేందర్ కవిత్వంలో కొత్తమాటలు కనిపిస్తాయి. వినూత్నమైన ఉక్తివైచిత్రులూ, విలక్షణమైన అభివ్యక్తులూ బొచ్చెడు అగుపిస్తాయి. అన్నవరం ప్రజల వ్యవహారంలో వున్న సామెతలు, శాస్త్రాలు, పొడుపు కథలు, పదాలు, పదభందాల్ని చాలా సమర్థవంతంగా వాడుకుంటాడు.
చాలా సందర్భాలలో అన్నవరం దేవేందర్ తన కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకుపోతాడు. ఉన్నట్లుండి కవిత్వం మధ్యలో మెరుపులు మెరిపిస్తాడు. మన కళ్ళను జిగేల్మనిపిస్తాడు. అ జిగిబిగిని అట్లాగే చివరిదాక నిర్వహిస్తాడు.
- డా. నలిమెల భాస్కర్
