-
-
బొబ్బిలి యుద్ధం
Bobbili Yuddham Drama
Author: Dr. C. Bhavani Devi
Pages: 102Language: Telugu
డా. చిల్లర భవానీదేవి గారి కలంనుండి 'బొబ్బిలి యుద్ధం' నాటకం వెలువడటం ముదావహం. నాకు అందిన వ్రాతప్రతిని ఆద్యంతం ఏకబిగిని చదివాను. అలా చదివించింది ఈ నాటకరచనాశైలి.
సరళమైన భాషలో పాత్రోచితమైన సంభాషణలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాల కూర్పు, నాటకాన్ని చకచకా పతాకస్థాయికి పరుగెత్తించేతీరు, రచయిత్రి రచనాపాటవానికి ప్రత్యక్షసాక్షులుగా నిలుస్తాయి. సందర్భానుసారంగా ఈ నాటకంలో డా. భవానీదేవి గారు వ్రాసిన పాటలు, పద్యాలు, బుర్రకథం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. విజయనగరరాజుల స్వార్థచింతన; మల్లయుద్ధంలో, కోడిపందాలతో బొబ్బిలివారితో ఓడిపోయామన్న అవమానభారం, ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి, విదేశీయులతో చేతులు కలపం, కుట్రలు కుతంత్రాలు ఒక వైపు - మరొకవైపు బొబ్బిలిదొరల సమైక్యతాభావం, సహనం, మాతృభూమిపై భక్తి, తమ శక్తిసామర్థ్యాల మీద ప్రగాఢ విశ్వాసం - చివరకు ఇరువర్గాల మధ్య సంకుల సమరం, బీభత్సం - ఈ అంశాలన్నిటినీ ఈ నాటకంలో చక్కగా చిత్రీకరించారు భవానీదేవిగారు. నవరసభరితమైన ఆయా సన్నివేశాలు, సంభాషణలు, ప్రేక్షకులను విపరీతంగా కదిలిస్తాయి, అలరిస్తాయి. ఉద్వేగభరితుల్ని చేస్తాయి.
నవరసభరితమైన ఇంత చక్కని నాటకాన్ని రచించి, తెలుగు నాటక రంగానికి అందజేసిన డా. చిల్లర భవానీదేవిగారికి నా హృదయపూర్వక అభినందనలు.
- దుగ్గిరాల సోమేశ్వర రావు
- ₹64.8
- ₹108
- ₹64.8
- ₹64.8
- ₹216
- ₹270
Kind Attn, When I am trying to open the PDF preview, it is opening the Bobbili Yuddham by Sri S Nagi Reddy, and not the book of Dr. C Bhavani Devi. Also, can you please mention regarding the book written by Dr. C Bhavani Devi on Vijayanagara kingdom.
Thanking you.