-
-
బొబ్బిలి యుద్ధం
Bobbili Yuddham
Author: N S Nagireddy
Language: Telugu
Description
నర్సారాయుడు, ధర్మారాయుడు ఏం చేయాలో తోచక తలలు దించుకున్నారు. వెంగళరాయుడైతే అవమానభారంతో క్రుంగిపోతున్నాడు! కలలో కూడా వూహించని దుష్పరిణామం?
బొబ్బిలి చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోయే ఘట్టమా? ఎలా? దీని బారినుండి తప్పించు కోవడం ఎలా? ఆ పరిస్థితినుంచి తప్పించగల యోధులే బొబ్బిలి గడ్డ మీద లేరా?
"ఎవరురా, బొబ్బిలి గడ్ద మీద తొడకొట్టి సవాలు చేసే మొనగాడు?" ఖంగుమని జనం మధ్యలోంచి వినవచ్చిందో కంఠం గంభీరంగా.
అంతా తలలుతిప్పి అటు చూసారు. జనం వినయంగా ప్రక్కకు తప్పుకుని దోవనిస్తున్నారు. ఆ దారిగుండా గోదాకేసి వస్తున్నాడో భారీకాయుడు. దట్టంగా చుట్టిన తలపాగా, దుస్తుల మాటున ఎంత దాచాలన్నా దాగని కండలు, మెలితిరిగిన బుగ్గమీసాలు, వేణుగోపాలునిపై భక్తికి సూచనగా నామాలు....
ఎవరు... ఇంకెవరు....?
Preview download free pdf of this Telugu book is available at Bobbili Yuddham
Login to add a comment
Subscribe to latest comments
