-
-
భూమి నుంచి ప్లూటో దాకా...
Bhoomi Nunchi Pluto Daka
Author: Chittarvu Madhu
Publisher: Self Published on Kinige
Pages: 266Language: Telugu
“భూమి నుంచి ప్లూటో దాకా...” అనే నవల నేను రాసిన స్పేస్ ఒపెరా నవలా త్రయంలో మూడవదీ, ఆఖరిదీ.
వైజ్ఞానిక కల్పనా సాహిత్యం (సైన్స్ ఫిక్షన్)లో స్పేస్ ఒపెరా ఒక ఉపశాఖ. దీనిలో సాధారణంగా భవిష్యత్తులో సాగే కథనం, రెండు సామ్రాజ్యాల మధ్య ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలు, కొంత రొమాన్స్, కొంత మాయాశక్తులు కలిసి వుంటాయి. ఈ విధమైన నవల రాయాలని నేను "War for Mars" రాసి ప్రచురించాను. ఆ తరువాత దాని కొనసాగింపుగా "Blue and Green", "Dark Outposts" అనే నవలలు అమెజాన్ లోనూ, సంపర్క్ కలకత్తా వారి ప్రచురణలలోనూ వచ్చాయి. ఇవి ఆంగ్లంలో అమెజాన్‌లో ఈ-బుక్స్‌గా లభ్యమవుతున్నాయి.
"కుజుడి కోసం" అనే నవల "War for Mars" కు నేను చేసిన అనువాదం. రచన మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. "నీలి ఆకుపచ్చ" అనేది రెండవ నవల శ్రీ కొల్లూరి సోమ శంకర్ సహకారంతో అనువాదం చేసినది. కినిగె అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ రెండు పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి. ఎలెక్ట్రానిక్ రూపంలో దింపుకోడానికి వీలుగా కినిగెలో ఉన్నాయి కూడా.
- మధు చిత్తర్వు
