-
-
భూభవ
Bhoobhava
Author: Poduri Krishnakumari
Publisher: Poduri Prachuranalu
Pages: 217Language: Telugu
భూభవ
అంతరిక్ష యానం, అంతరిక్ష పరిశోధనపై వ్రాసిన నవల. కొన్ని పురాణాలలో కనపించే శాస్త్ర విజ్ఞానం కొద్దిగా ప్రస్తావించబడింది. ఎన్నో కనిపెడుతున్నాననుకున్న మానవుడికి ప్రకృతి కొత్త సవాళ్ళు విసురుతూనే ఉంటుంది అన్న ముగింపు.
* * *
రోదసి పరిశోధనలపై తెలుగులో వచ్చిన మొదటి నవల.
రోదసినౌకల ప్రయాణంపై పరిశోధనచేసి, రాబోయే శతాబ్దులలో అంతరిక్ష పరిశోధనలను ఊహించి రచించిన ప్రయోగాత్మక నవల ఇది. పైగా రచయిత్రి ఈ నవలలో కథాకాలాన్ని చెప్పకుండా పాఠకలోకానికే వదిలేసారు.
ఈ కథాంశం ప్రకారం ఈనాడు మనం భారతదేశంగా చెప్పుకుంటున్న భారత భూభాగంలో 'నాస్క్' అనే సంస్థ డైరెక్టర్ బృహస్పతి భూతభవిష్యత్ వర్తమాన కాలాలకు ఒకే సమయంలో వ్యోమనౌకలు పంపి పరిశోధనలు చేసేందుకై శాస్త్రజ్ఞులను ఎన్నుకుంటాడు. ఆ మూడు వ్యోమనౌకలు బయలుదేరడం, అవి కొన్ని శాస్త్ర పరిశోధనలు అంతరిక్షంలోను, కొన్ని గ్రహాలమీద ఆయా పరిశోధనలకు కలిగిన అనేకానేక ఉత్కంఠభరితమైన అనుభవాల రూపమే ఈ నవలలోని వస్తువు.
ఇది ఓ కుటుంబ కథాకథనం కాదు. అందరినీ ఆకట్టుకునే ప్రేమ కథాకథనమూ కాదు. ఈనాటి వరకూ జరుగుతున్న అంతరిక్ష పరిశోధనలతో రాకెట్ ప్రయోగాలతో కలిగిన ప్రయోజనాలతో కూడిన కథాంశంతో కూడిన ఆసక్తిదాయకమైన నవల ఇది.
ఈ నవలలో ముఖ్యంగా రోదసియాన శిక్షణలు, స్పేస్ షటిల్ నిర్మాణ విశేషాలు, ఆధునిక వైజ్ఞానికులు కనిపెట్టిన శాస్త్రవిజ్ఞానాలు అనేక శతాబ్దులకు ముందే మన శాస్త్రజ్ఞులు కనుగొని మరుగునపడిన కొన్ని ముఖ్య విషయాలు మనని ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఈ నవలలో అరుదైన విషయాలు గోచరిస్తాయి.
- డా. వాసా ప్రభావతి
