-
-
భోగినీ లాస్యం
Bhogini Lasyam
Author: Vanamamalai Varadacharyulu
Publisher: Yuva Bharathi
Pages: 68Language: Telugu
తెలుగు వాఙ్మయంలో తొలి దండక రచనగా విమర్శకులు పోతన 'భోగినీ దండకం'ను పేర్కొంటూ వున్నారు. పైగా ఆ కాలంలో రాజవేశ్యలు కూడ కేవల సౌందర్య విలసితులు కావడం మాత్రమే కాక ప్రతిభాపాటవాలు గలవారిగా రాణిస్తూండేవారు. ఆమె లోని నాట్యకళా వైభవానికి ముగ్ధుడై పోతన ఆమెను అమె కథనాన్ని రచించి వుండవచ్చు.
'పోతన చరిత్రము' రచించిన శ్రీ వానమామలై వరదాచార్యులుగారు 'అభినవ పోతన' అనిపించుకున్న విద్వన్మణులు. పోతన భోగినీ దండకం రాసినట్లుగా విశ్వసించినందువల్లనే వరదాచార్యులుగారు భోగినీ లాస్యం గురించి డెభ్భై ఏడు పద్యాలతో రసోచితంగా వివరించి రాసారు.
జనం భావించినట్లు భోగిని రాజాస్థాన వేశ్య అనీ, రాచకొండ ప్రభువైన సర్వజ్ఞ సింగ భూపాలుని ఉంపుడుగత్తెయనీ భావించడం తగదని అంటారు వరదాచార్యులవారు. ఆమె వేశ్య కాదనీ, రాజుగారి భార్యయే అని అంటారు. పట్టాభిషిక్తురాలు కాని రాజు భార్యని భోగిని అనడం నాడు రూఢిగా వున్నదనీ అందువల్ల భోగినిని సింగభూపుని పట్టంపురాణిగాని భార్యగా భావించడం న్యాయమని, అప్పుడే భక్తి జ్ఞాన వైరాగ్యరాశియైన పోతనను మహాకవి భోగినిని గురించి దండకం రాసాడు అనడం యుక్తియుక్తమేనని పేర్కొన్నారు.
భోగినీ లాస్యం పోతన చరిత్రంలోని ఒక మధుర ఘట్టం. నాట్యకళా వైభవాన్ని, శృంగార రస మధురిమనీ, ప్రణయభక్తి భావనారాధనాన్నీ వివరించే రచనం. సవ్యాఖ్యానంగా ఆ ఘట్టాన్ని వరదాచార్యులవారు యువభారతికి ఉపాయానంగా అందించిన ఈ గ్రంథాన్ని ఈ తరం పాఠకులులకు పునర్ముద్రణగా అందిస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది.
- ప్రకాశకులు
