-
-
భిన్న ధృవాలు
Bhinna Dhruvalu
Author: Madireddy Sulochana
Publisher: Navodaya Publishers
Pages: 160Language: Telugu
''శాంతీ!''
''ఏం వదినా!''
''అత్తయ్య చాలా బాధపడుతోంది.''
''బావుంది వదినా! విధేయత చూపినా కష్టమేనా మీతో?''
''ఓ రెండుగంటలు వస్తే ఏం?''
''నాకిష్టం లేనిపని చేయించటమే మీ ధ్యేయమైతే నాకేం అభ్యంతరం లేదు.'' లేచింది.
''నువ్వు చాలా మారిపోయావు శాంతీ. వద్దు, నువ్వు రావద్దులే'' అని పోబోయి ఆగిపోయింది.
''శాంతీ!''
''ఇంకా ఏమయినా అడగాలా వదినా?''
''అవును. నువ్వు శ్రీధర్ని హృదయపూర్వకంగా ఇష్టపుతున్నావా?''
''ఏం అనుమానంగా ఉందా?''
''అవును. నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి.''
''మా ముద్దరాలు వదినకు కళ్ళభాష కూడ వచ్చునే.'' నవ్వింది.
''అతన్ని ఇష్టపడక పోవటానికి కారణం ఏముంది వదినా? ధనవంతుడు, అందగాడు, విద్యావంతుడు, త్వరలో అమెరికా వెడుతున్నాడు...''
''ఒకప్పుడు వివాహానికి ఇవే అర్హతలు కావు అనే దానివి.''
''ఎప్పుడూ ఒకేలా ఉండముగా.''
''పోనీ నేను యెంతో దగ్గరగా వచ్చినా నన్ను అంత దూరములో ఉంచుతావు.''
''లేదు వదినా...''
