-
-
భీమాయణం2
Bhimayanam2
Author: Sri Vidya Natarajan and S. Anand
Publisher: Hyderabad Book Trust
Pages: 50Language: Telugu
ఆంగ్ల కథనం: శ్రీ విద్య నటరాజన్, ఎస్. ఆనంద్
తెలుగు: డి. వసంత
భారతదేశంలో అంటరానివారిగా జీవించటమంటే ఏమిటి?
భారతీయుల్లో కొందరు తమ సాటివారిని ఎందుకు ముట్టుకోరు?
భారతదేశపు విప్లవాత్మక సంస్కర్తల్లో అగ్రగణ్యులైన భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్ (1891-1956) ఒక అస్పృశ్యుడిగా తాను ఎదుగుతున్నక్రమంలో ఎదుర్కొన్న అనుభవాలను అక్షరబద్ధం చేశారు.
పదేళ్ల వయసులో స్కూల్లో,
కొలంబియా యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడాలో,
ప్రయాణాల్లో...
ఇలా ఎన్నోచోట్ల చాలా 'సర్వసాధారణంగా' తాను వివక్షను ఎదుర్కొన్న తీరును వివరించారు అంబేడ్కర్.
ప్రతికూలతలకు ఎదురొడ్డి అంబేడ్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా రాశారు.
తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించారు.
నాడు అంబేడ్కర్‌కు ఎదురైన అనుభవాల్లాంటివే
నేడు భారతదేశంలోని 17 కోట్ల మంది దళితులనూ వెన్నాడుతూనే వున్నాయి.
ఇప్పటికీ వారికి ప్రాథమిక అవసరాలైన నీరు, నీడ వంటివి తిరస్కరింపబడుతూనే వున్నాయి.
ఈ వినూత్న ప్రయత్నంలో పార్థాన్ గోండు చిత్రకారులైన దుర్గాబాయి వ్యాం, సుభాష్ వ్యాంలు మహద్ సత్యాగ్రహం వంటి చారిత్రక ఘట్టాలను నేటి సమకాలీన భారత సమాజంలోని ఘటనలతో కలగలిపి కథ అల్లటం విశేషం.
సంప్రదాయ బొమ్మల, గ్రాఫిక్ పుస్తకాల వ్యాకరణాన్ని ధిక్కరిస్తూ, తమదైన మాంత్రిక కళను ఇతిహాస స్థాయిలో రూపుకట్టిస్తూ గ్రాఫిక్ కళా రంగానికే ఒక కొత్త నుడికారాన్నీ, సరికొత్త జవజీవాలనూ అందించారు.
The art work is very interesting! I think I should browse through the book once again just for the sake of the art! Thanks for making this book available digitally!