-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
భావయామి వేంకటేశమ్ (free)
Bhavayami Venkatesam - free
Publisher: Self Published on Kinige
Pages: 1619Language: Telugu
అన్నమయ్య కీర్తనలకు భావం వ్రాయాలని నేను నిశ్చయించుకొని ఒకరి సలహా అడిగితే. తెలుగు కీర్తనలకి వివరణ అవసరమా అన్నట్లు మాట్లాడారు. పరమాత్మ దశావతారములను అచ్చతెలుగులో పాడిన అన్నమయ్య కీర్తనలు చూడండి. దీనికి సరి అయిన అర్ధం (భావం) 'నాకు తెలుసా' అని ఎవరికి వారు మనస్సులో ప్రశ్నించుకోండి. దీక్షితులు నిజమే చెబుతున్నాడని మీకు తప్పక అనిపిస్తుంది. అన్నమాచార్యులవారి కీర్తనలు అంతతేలికగా కొరుకుడు పడవు.
సంస్కృత, తెలుగు నిఘంటువుల సహాయంతో మాత్రమే నేను ఈ నా సంకల్పం నెరవేర్చానని చెప్పడానికి నేనేమాత్రం సిగ్గు పటం లేదు.
ఇకపోతే మున్నుడి ప్రతికీర్తనకి కావాలా? దాంట్లో పద్యం ఎందుకు? అనే ప్రశ్నలుత్పన్నమయ్యాయి. మున్నుడి అంటే ఉపోద్ఘాతం లేక అవతారిక. మున్నుడి తెలుగు మాట కాబట్టి దాన్నే ఎన్నుకొన్నాను. కీర్తన వైశిష్ఠ్యం తెలిపే ఉద్దేశ్యంతోనే ప్రతికీర్తనకి మున్నుడి చెప్పాను. ఇక ప్రతి కీర్తనకి ఒక పద్యం చెప్పడానికి కారణం మాత్రం పద్యాలపై నా ప్రేమ స్పురింప చేయటమే కాక, అన్నమాచార్యుల వారిని నా ఇష్ట దైవమైన వేంకటేశ్వరుని కీర్తించటమే.
భావామృతంలో కీర్తనని ప్రతి చరణంలోని ప్రతిమాటను వివరించాలని నా ఆశయం. అందుకనే పేరాలుగా విడివిడిగా వ్రాశాను. ఏ చరణాన్నయినా తేలికగా అర్థం భావయామి వేంకటేశం చేసికొనవచ్చును.
- రచయిత

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE