-
-
భావపరిమళము
Bhavaparimalamu
Publisher: Nirmala Publications
Pages: 115Language: Telugu
కవిత్వంలోని సొగసులను, పదవ్యుత్పత్తులను విశద పరచటం కేవల సాహిత్యవేత్తలకు, కేవల భాషైక దృక్కులకు సాధ్యం కాదు. ఆంధ్ర సారస్వత భాషా శాస్త్ర సవ్యసాచులయిన ఆచార్య బాలగంగాధరరావు గారికే ఇది సుసాధ్యమయింది.
సహృదయ సార్వభౌములు, శబ్ద సాగర సారంగులు ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారిని ఇటువంటి ఉత్తమ 'భావ పరిమళ' గ్రంథరాజాన్ని రచించినందుకు మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
- లకంసాని చక్రధరరావు
* * *
కారణాలు ఏవైనా నిరంతరాలోచనకు ప్రేరణ కలిగించే అంశాలే సాహిత్యంలో ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తాయి. విశ్రాంతాచార్యులైన బాలగంగాధరరావు గారు నిరంతర విద్యార్థిగా ఆపరిష్కృతాంశాల పరిష్కరణ విషయంలో లగ్నబద్ధులై ప్రవర్తించడం వారి సాహిత్య సామనస్యానికి తార్కాణము.
ఈ లఘు గ్రంథం కొన్ని పాఠాల ఆర్థ నిర్ణయ విషయంలో శక్తి చాల చీకట్లోనే కొట్టుకొనే ప్రాచీన సాహిత్యాభిమానులకు వెలుగునిచ్చే కరదీపికగా వెలువడింది.
- ఉ. అ. నరసింహమూర్తి

- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4