-
-
భవాని కవిత్వం 2
Bhavani Kavitvam 2
Author: Dr. C. Bhavani Devi
Pages: 478Language: Telugu
Description
అక్షరం ఆనందింపజేస్తుంది. భయపెడుతుంది, అమ్మలా ఓదారుస్తుంది. బాల్యంనుంచి పుస్తక ప్రపంచంలో అక్షరాల ఉయ్యాలలో సేదతీరిన నేను ఎన్నెన్నో ఒత్తిళ్ళ తుఫాన్లలో కూడ చాలా రాత్రుల నిద్రను అక్షరాలుగా కరిగించుకున్నాను. అనేక సముద్రాల్ని అక్షరాల నావలోనే ఈదాను. పది సంపుటాల కవిత్వాన్ని రెండు సమగ్ర సంపుటాలు చేయాడానికి తొలినాళ్ళ సంపుటాల అలభ్యత కొంత కారణం. ఎవరి కవిత్వమైనా ఇన్నేళ్ళ కాలప్రవాహానికి ఎదురీది పొందిన మార్పుల్ని, పరిణతిని అంచనా వేయానికి ఇటువంటి సంపుటాలు దోహదపతాయనేది నిర్వివాదాంశం.
- డా. సి. భవానీదేవి
………
వాళ్లిద్దరూ
ఇంగ్లీషులో టాకింగ్
అమ్మయ్య
మన తెలుగువాళ్లే!
………
ఎక్కడ చూసినా
సెల్లుల జల్లు
ఆలుబిడ్డలతో
మాటలు నిల్లు
………
ఎర్రబస్సు
నగరంలో ఆగింది
పొట్ట చేతబట్టుకొని
ఆకలి దిగింది
………
గోల్కొండ గోడకి
చెవులానించి చూడు
అది
భాగమతి మువ్వల చప్పుడు
Preview download free pdf of this Telugu book is available at Bhavani Kavitvam 2
Login to add a comment
Subscribe to latest comments

- ₹64.8
- ₹108
- ₹64.8
- ₹64.8
- ₹216
- ₹270