-
-
భావన - డా. సి. భవానీదేవి అభినందన సంచిక
Bhavana Dr C Bhavani Devi Abhinandana Sanchika
Author: Dr. C.S.R. Murthy
Pages: 230Language: Telugu
డా|| సి.భవానీదేవి తెలుగు భాషా సాహిత్య రంగాలలోని అనేక ప్రక్రియల్లో గణనీయ రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి. ఈమెకు తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా సముచిత పరిజ్ఞానముంది. 'స్వాతంత్య్రానంతరం తెలుగు హిందీ కవిత'లపై తులనాత్మక అధ్యయనం చేసి పి.హెచ్.డి. పట్టం పొందిన విదుషీమణి ఈమె. అంతేకాక ఈమె న్యాయశాస్త్రంలోనూ పట్టం అందుకున్నారు.
ఆమెకు ఇప్పుడు అరవైఏళ్ళొచ్చాయి. వాటిలో ఆమె సాహిత్య సృజన వయస్సు నలభై ఏళ్ళు. జీవితం, నిరంతర సాహితీ వ్యాసంగం రెండూ దాదాపు అద్వైతంగా నడిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పనికాదు. ముఖ్యంగా గృహిణిగా, బాధ్యతగల తల్లిగా, ఉద్యోగినిగా ఇన్నింటిని నిర్వహిస్తూ త్వరత్వరగా అనేక పరిణామాలు చెందుతున్న సాహిత్యలోకంతోపాటు కలిసి పరుగులు తీస్తూ...
డా|| భవానిగారు చిన్నప్పుడు చేయలేకపోయిన పి హెచ్.డి. పరిశోధన, తదనంతర ఉద్యోగ జీవితంలో దానివలన పదోన్నతులు లాంటి ప్రయోజనం లేకపోయినా, కేవలం జ్ఞానతృష్ణతో భారతీయ తులనాత్మక సాహిత్యం పైన ప్రామాణిక మైన పరిశోధన చేశారు. ఆ రకంగా ఆమె మాదృశులకు శిష్యస్థానీయురాలు.
భవానీగారి నాలుగుదశాబ్దాల సాహిత్యోత్సవం ఒక మైలురాయిగా నిలిచి వారి భవిష్యత్ సాహిత్య విజయాలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
- డా. పి. గోపి
