• Bhavajala Parinamam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భావజాల పరిణామం

    Bhavajala Parinamam

    Author:

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

….వర్గదృక్పధం, కుల దృక్పధం, స్త్రీవాద దృక్పధం, జాతుల సమస్య దృక్పధం, ప్రాంతీయ అసమానతల సమస్య దృక్పధం, మైనార్టీ, ముస్లిం ప్రజల దృక్పధం, ప్రజాస్వామిక దృక్పధం తదితర దృక్పధాలు ఒకే వేదికపై వచ్చి నిలిచాయి. పరస్పరం సంఘర్షించుకున్నాయి. పరస్పరం ప్రభావితమయ్యాయి. కలిసి పని చేసే క్రమంలో తమ దృక్పధాలను, పనివిధానాలను, కార్యక్రమాలను, వ్యూహం, ఎత్తుగడలను, ప్రాధాన్యతలను, ప్రధాన వైరుధ్యం, అప్రధాన వైరుధ్యాలు, నిర్ధిష్ట వైరుధ్యాలు, సార్వజనీన వైరుధ్యాలు తక్షణ కర్తవ్యాలు తదితర అంశాలను సమూలంగా సమీక్షించుకుని పునర్‌నిర్వచించుకున్నారు. పునర్‌ నిర్మించుకున్నారు. అలా అనేక భావజాలాలు తమను తాము మార్చుకున్నాయి. మలుచుకున్నాయి. సంశ్లేషించుకున్నాయి. నూతన జవసత్వాలతో ముందుకు సాగాయి.

ఈ పరిణామాలకు రాష్ట్రంలో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక భావజాలాన్ని, నాయకత్వాన్ని అందించింది. తద్వారా నూతన చరిత్రకు పురుడు పోసింది. బి.సి, ఎస్‌.సి, ఎస్‌.టి, మైనార్టీ, ముస్లిం రచయితలను కళాకారులను విద్యావంతులను ఒక్కటి చేసింది. లక్షలాది ప్రజలకు ఉత్తేజాన్ని అందించింది. దరకమే ఐక్యవేదిక రాష్ట్రంలో ఏర్పడకముందు సమాజం, సాహిత్యం, సాహిత్య విమర్శలు వేరు. దరకమే ఐక్యవేదికది వెయ్యేల్ల తెలుగు సాహిత్యంలో, సామాజిక ఉద్యమంలో ఒక మహోన్నతమైన చరిత్ర.

సమస్త భావజాలాలను సంశ్లేషించి దరకమే ఐక్యవేదిక సమస్త వర్ణ వర్గ కుల మత లింగ జాతి ప్రాంత భాష దేశ విచక్షణలకు అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం వర్తమానంలో సమస్త సమాన అవకాశాలకోసం నిలబడింది. నిలదీసింది. ఉద్యమించింది. తానే ఒక చరిత్రగా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. దీని ప్రారంభ పరిణామాలను, చారిత్రక డాక్యుమెంట్లను ఈ మొదటి సంపుటిలో చేర్చడం జరిగింది. ఇది సమాజంలో 1977 నుండి 1995 దాకా సాగిన సామాజిక సైద్ధాంతిక సంఘర్షణను, భావజాల పరిణామాన్ని పరిచయం చేస్తుంది.

- బి.ఎస్‌. రాములు

Preview download free pdf of this Telugu book is available at Bhavajala Parinamam