-
-
భావగతం, పంచాక్షరి, అష్టాక్షరి
Bhavagatam Panchakshari Ashtaakshari
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 160Language: Telugu
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించిన "భావగతం", "పంచాక్షరి", "అష్టాక్షరి" అనే మూడు కావ్యాల సంపుటం ఈ ఈ-బుక్.
* * *
ఇది శకతం కాని శతకం. నూటొక్క పద్యాలైతే ఉన్నాయి గానీ దేని కిరీటం దానిదే అయ్యింది. మకుట నియమానికి సడలింపుతో ఇది శతకం. ఇందులో రాముడున్నాడు. వేణుగోపాలుడున్నాడు. చంద్రశేఖరుడున్నాడు. వేంకటేశ్వరుడున్నాడు. యాదగిరీశ్వరుడున్నాడు. బదరీనారాయణుడున్నాడు. అలాగే నాలుగురకాల వృత్తాలున్నాయి. కందాలు ఉన్నాయి. కొందరు పద్దెరాణులు గద్దె మీదకి వచ్చారుగానీ కిరీటాలు మర్చిపోయారు. ఇన్ని రకాల వైవిధ్యాల కూడలి ఈ భావగతం.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
* * *
డా. రావికంటి వసునందనుడు ఉత్తమశ్రేణికి చెందిన కవి. ఎన్నో గ్రంథములు వ్రాసి లబ్ధప్రతిష్ఠుడైన కవిశిరోమణి. పంచాక్షరి అనే పేరుతో ఈ వస్త్వాత్మక కావ్యం విరచించాడు. కథలు శివపురాణాంతర్గతములు. త్రిపురాసుర సంహారము, శ్రీకృష్ణుని తపస్సు, పాశుపతాస్త్ర ప్రదానము, బాణాసుర వృత్తాంతము, శివకేశవ సంలీనము - ఐదు కథలు కాబట్టి పంచాక్షరి-పంచామృతము కూడా. ఈ కృతి ఆద్యంతము రసనిర్భరము.
- ఆచార్య ముదిగొండ శివప్రసాద్
* * *
ఓమ్ నమో నారాయణాయ అనే నారాయణ మంత్రం అష్టాక్షరి. ఈ అష్టాక్షరి నూట ఎనభై ఎనిమిది పద్యాలున్న కథా కావ్యం. మొత్తం కూడితే ఎనిమిది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బుద్ధ, కల్కి అనే శ్రీమన్నారాయణుని ఎనిమిది అవతారకథా విశేషాలను సంగ్రహంగా వర్ణించే స్తుతి కావ్యం ఇది. కీర్తన భక్తి మార్గానికి సంబంధించింది. భగవంతుడైన శ్రీమన్నారాయణుని స్వరూప స్వభావాలను మనసారా అనుభవించి, నోరారా ప్రకటించడమే స్తుతి, నుతి. జీవులకు భగవద్దాస్యం స్వరూప సిద్ధం. దాస్యలక్షణాల్లో స్తుతికావ్య రచన ప్రధానమైనది. ఈ పద్యరచన స్తుతికావ్యమే.
- డా. తిరుమల శ్రీనివాసాచర్య

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹60
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹60