• Bhaskara Satakam Victory Publishers
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భాస్కర శతకం - విక్టరీ పబ్లిషర్స్

    Bhaskara Satakam Victory Publishers

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!


తాత్పర్యము: భాస్కరా! నలచక్రవర్తి వంట చేసినట్లుగా చేయుటకు మంచి కూరను తెచ్చి వండిననూ దాని యందు కొంచెము ఉప్పు వేయకున్న రుచి పుట్టదు. అట్లే మానవుడు ఎంత సంపూర్ణ విద్వాంసుడైనననూ, తాను చదివిన దాని యందలి రసము గ్రహించకున్నచో ఆ విద్య పలువురకు నుపయోగపడదు. గుణవంతులెవ్వరునూ మెచ్చరు.

* * *


తెలియని కార్య మెల్లఁ గడతేర్చుట కొక్కవివేకిఁ జేకొనన్
వలయునటైన దిద్దుకొనకవచ్చుఁ బ్రయోజన మాంద్య మేమియుం
గలుగదు ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు సేత నద్దమున్
గలిగినఁ జక్కఁ జేసికొనుగాదె నరుండది చూచి భాస్కరా!


తాత్పర్యము: భాస్కరా! మనష్యుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు గల అద్దము సహాయముతో ఆ బొట్టును సరిచేసుకొనవచ్చును. అట్లే తనకు తెలియని పనిని నెరవేర్చుకొనుటకు ఒక నేర్పరి సహాయముతో ఆ పనులను చక్కపెట్టుకుని పని నిర్వహణలో ఎటువంటి లోపము, ఆలస్యము లేకుండా చేసుకొనవచ్చును.

Preview download free pdf of this Telugu book is available at Bhaskara Satakam Victory Publishers