• Bharya Bharta Santoshamga Vundadam Yela - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భార్య, భర్త సంతోషంగా ఉండడం ఎలా? (free)

    Bharya Bharta Santoshamga Vundadam Yela - free

    Pages: 257
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్రొత్తగా పెళ్ళైన వారికి ఇదొక చక్కని గైడ్, పెళ్లి బహుమతిగా ఇవ్వదగ్గ పుస్తకం. ఈ కాలంలో భార్య భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోలేక అపార్థాలకు గురవుతున్నారు, విడిగా ఉంటున్నారు, విడిపోతున్నారు. ఈ పుస్తకంలో అటువంటివారికి కొన్ని మంచి చిట్కాలున్నాయి.

పుస్తకం బాగుంది, భార్య, భర్తల అన్యోన్యత గురించి సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకం తెలుగులో రావటం సంతోషంగా ఉంది.

- డాక్టర్ బి.వి. పట్టాభిరామ్

భార్యా భర్తల సంబంధాల గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నా అన్ని విషయాలూ సమగ్రంగా చర్చించినవి లేవు. ఇతర భాషల్లో కొంతవరకూ ఉన్నా తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలు లేవనే చెప్పాలి. నేటి ఆధునిక యుగంలో పెళ్లి కూడా వేగంగా జరిగే వేడుక అయిపోయింది. అందుకనే అంతే వేగంగా విడాకులు తీసుకునే వారూ పెరుగుతున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే అటు ఇటు ఏడుతరాలు చూసేవారట. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి చూసుకోవడమే ఎక్కువ. అన్నిటికీ తొందరే. ఈ పరిస్థితుల్లో మీరు రచించిన ఈ పుస్తకం చాలా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. పెళ్లి చేసుకోబోయేవారికి, పెళ్లి అయిన వారికి కూడా దిక్సూచి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీ, పురుషుల స్వభావాల నుంచి వివాహానంతరం భార్యాభర్తలుగా వారి కోరికలు, అలకలు ఏవిధంగా మొలకెత్తుతాయో చక్కగా వివరించారు. అలాగే పెద్దవారు చేయకూడనివి చెప్పారు. వివాహానికి ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే ఎన్నో సమస్యలు రాకుండా నివారించవచ్చు. అలాగే సమస్య ప్రారంభంలో ఫ్యామిలీ కౌన్సిలర్ వద్దకు వెళ్తే సులభంగా పరిష్కారమవుతుంది. అన్ని విధాలా ఉపయుక్తంగా ఉన్న ఇటువంటి పుస్తకం ఇంగ్లీషులో కూడా వస్తే యువతరానికి మేలు. ఎంతో శ్రమకోర్చి రాసిన ఈ పుస్తకం అన్ని వయసులవారి సంసార జీవితానికి కరదీపికగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

- కె.శోభ

గమనిక: "భార్య, భర్త సంతోషంగా ఉండడం ఎలా?" ఈబుక్ సైజు 9.2 mb