• Bharatiya Samskaralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయ సంస్కారాలు

    Bharatiya Samskaralu

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సనాతన ధర్మము, ఆ తరువాత అందులోంచి పుట్టిన వేదమతానుసారియైన స్మృతిమతము ఇవన్నీ ఏ మూలసూత్రాన్ని దృక్పథంతో పెట్టుకొన్నామో వాటికి, లౌకిక భౌతికమైన ప్రగతిని, సమృద్ధిని కోరే సమాజము యొక్క దృకృథానికి భేదం ఉండి తీరుతుంది అన్నారు సద్గురు కె. శివానందమూర్తి గారు భారతీయత అనే వ్యాస సంకలనంతో.

భారతీయ సంస్కారాలు అనే ఈ గ్రంథంలో రచయిత గోపాలకృష్ణగారు వేద సమ్మతమైన భారతీయ సంస్కారాలను గూర్చి సంకలనం చేసిన ఈ గ్రంథం, వైదిక ధర్మాన్ని అనుష్టించాలనే ఆసక్తి గలవారికి కరదీపిక.

సర్వేజనా స్సుఖివో భవంతు అని ఫలశ్రుతి చెప్పారు. అది మా ఆకాశవాణి లోగోలో ప్రస్ఫుటంగా ఉండే వేదవాక్యం. గోపాలకృష్ణ తమకున్న చలనచిత్ర అనుభవానికి తోడు, శాస్త్ర విజ్ఞానాన్ని కూడా సంక్రమింపజేసుకున్నారు. వేద ప్రమాణాలతో, శ్రుతి ఉదాహరణలతో తమ ప్రతిపాదనలకు పుష్టిని చేకూర్చారు.

ఉగ్ర రధ శాంతి, భీమరధ శాంతుల ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా వివరించారు. ఉగ్రరధ శాంతి వల్ల అకాలమరణం రాదనీ, జాతక రీత్యా చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుంటాయని సూచించారు. అంత్యేష్టి గూర్చి వివరంగా ప్రస్తావించారు.

తిలకధారణ ప్రాధాన్యాన్ని వివరించారు. సనాతన సాంప్రదాయానికి దూరమైతే కలిగే నష్టాలను మనకు గుర్తుకు తెచ్చారు. శ్రీనాధుని కాశీఖండంలో గుణనిధి కథ ఈ సందర్భంలో గుర్తుకు వస్తుంది. ఆచారవంతమైన కుటుంబంలో పుట్టిన గుణనిధి వ్యసనాలకు బానిసయై భ్రష్టుడౌతాడు. తండ్రి, భార్యను, కుమారుని త్యజిస్తాడు.

గుణనిధి శివరాత్రి రోజు ఆహారం దొరకక ఉపవసిస్తాడు. శివాలయంలో నైవేద్యం అపహరించడానికి జాగరం చేస్తాడు. శివుని ముందు అన్నపాత్ర కనిపించక దీపారాధన చేస్తాడు. శివుని దర్శిస్తాడు. తలారులు దొంగ అని చావగొడతారు. శివాలయ ప్రాంగణంలో చనిపోవడంతో శివ సాన్నిధ్యానికి చేరుతాడు. స్వల్పమాత్ర భక్తి ఎలా అతణ్ణి శివసాన్నిధ్యానికి ఎలా చేర్చిందో కథ అది. మన సంప్రదాయాన్ని మనం నమ్మాలి.

ఈ గ్రంథం పాఠకులని మెప్పింస్తుందని విశ్వాసం.

- డా. ఆర్. అనంత పద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Bharatiya Samskaralu