-
-
భారతీయ ప్రతిభా విశేషాలు- 108 నిజాలు
Bharatiya Pratibha Visheshalu 108 Nijalu
Author: Ramakrishna Math
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 348Language: Telugu
మన మాతృభూమికి ప్రపంచం ఎంతగానో ఋణపడి ఉంది. నేను నా దేశం గతంలోకి, చరిత్రలోకి ఒకసారి వెనుదిరిగి చూస్తే.. నా దేశంతో సరిసమానమైనదిగా, మరే దేశము మానవ బుద్ధి వికాసానికి తోడ్పడలేదని నా కనిపిస్తుంది. అందుకే నా దేశం గురించి నాకు చింతించడానికి మాటలులేవు. నేను చెప్పదలచుకున్నదొక్కటే, ''చాలా బాగా చేశారు. మరింత బాగా చేయండి.''
ప్రాచీన శాస్త్రీయ వైద్యులను అందించింది భారతీయులే. సర్ విలియమ్ హంటర్ ''భారతదేశం ఆధునిక వైద్య శాస్త్రానికి ఎంతో మేలు చేసింది. ఎన్నో రసాయనాలు కనుగొనడం ద్వారా, తెగిన ముక్కులు, చెవులు సరిదిద్దే ప్రక్రియ చెప్పటం ద్వారా మనకు ఎంతో సాయం చేసింది'' అన్నారు. ఇంతకంటే ఎక్కువగా, గణితంలో భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. బీజగణితం, రేఖాగణితం, ఖగోళ శాస్త్రం, నవీనమైన శాస్త్ర పురోగతికి సహాయపే శాస్త్రం, గణితాల మేళవింపూ ... భారతదేశంలో కనుగొనబడినదే. సున్నా నుంచి 9 వరకు ఉన్న ఆ పది సంఖ్యలే నేటి మానవ సంఘానికి మూలాధారం. అవి భారతీయులు కనుగొన్నారు. అనాదిగా సంస్కృత భాషలో అవి ఉన్నాయి.
వేదాంత విషయాలలో నేటికీ భారతీయులదే అగ్రస్థానమని, ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త సోఫెన్వొసర్ చెప్పాడు. సంగీతానికి సప్త స్వరాలనూ, లిపినీ, ఆరోహణ అవరోహణలనూ అందించింది భారతదేశమే. ఇక భాషాపరంగా చూసినట్టయితే సంస్కృత భాషకు సరిసాటి భాషేలేదు. సంస్కృతం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. దాదాపు అన్ని యూరోపియన్ భాషలు సంస్కృతం వల్లా ప్రభావితమైనాయి అని నేు అందరూ అంగీకరిస్తున్నారు. భారతీయ సాహిత్యం అందించిన కావ్యాలు, పద్యాలు, నాటకాలు ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన వాటికి ఏ మాత్రం తీసి పోవు. జర్మన్ దేశంలో మన సంస్కృత 'శాకుంతలం' నాటకం అద్భుతంగా ప్రాచుర్యం పొందింది. పసిపిల్లలను ఆహ్లాదపరుస్తున్న అరేబియన్ నైట్స్ కథలకు మూలం కూడ సంస్కృతంలోని కథలే. సిండ్రిల్లా, బీన్స్స్టాక్స్ కథలన్నీ మన నుంచి గ్రహించినవే. ఇక తయారీ పరిశ్రమలలో మొదట పత్తిని, పర్పుల్ (డై) ని తయారుచేసింది భారతీయులే. ఆభరణాలు, చక్కెర, చదరంగం, పేకముక్కలు, దాయాలు (డైస్) ఇలా ఎన్నో రంగాలలో ప్రగతి సాధించిన భారతదేశం యూరోపియన్లకు, గమ్యస్థానంగా కనిపించింది. ఆ క్రమంలోనే అమెరికా కనుగొనటానికి
కారణమయింది.
భారతదేశంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాతలు ప్రపంచగతిని మార్చగలిగిన వారు లేనికాలం ఎప్పుడుందో చూపించమని నేను ఇతరులను సవాలు చేస్తున్నాను. అయితే భారతదేశం ఆధ్యాత్మిక పథగామి. అది యుద్ధ భేరీలతో, రథబల దాడులతో సమకూరేది కాదు. ప్రపంచం మీద భారత ప్రభావం ఒక చక్కని మంచు తెరవంటిది. అది సొగసైన పూల మొక్కలకు అడ్డు రానటువంటిది.
భారతమాత మరోసారి మేల్కొంది. చైతన్యమూర్తియై సింహాసనాన్ని అలంకరించింది. పూర్వమెప్పుడూ లేనంత వైభోగంగా శోభిల్లుతోంది. ఈ దృశ్యం నా కళ్ళకు స్పష్టంగా కనబడుతోంది. ఆమె ఏలుబడి ప్రారంభమైనదనే విషయాన్ని, ఆమె ఆశీర్వచనాల్ని, శాంతి శంఖారావం పూరిస్తూ .. ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి.
లేవండి! మేల్కొనండి. గమ్యం చేరేవరకూ విశ్రమించకండి.
- స్వామి వివేకానంద
గమనిక: "భారతీయ ప్రతిభా విశేషాలు- 108 నిజాలు" ఈ-బుక్ సైజు 14 MB
- ₹129.6
- ₹180
- ₹60
- ₹72
- ₹81
- ₹81
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
On page 25, author should have given more explanation. It sounds negativity on Christianity. I mean actually original Hebrew bible did show indications that our planet is in sphere shape and didn't say earth is center. But some churches in old days, edited as per what they(and elders) believed. And all who doesn't know this blames bible instead of those editors.
I just trying to say Bible is also flawless holy book.