-
-
భారతీయ గణిత శాస్త్ర చరిత్ర (జ్యోతిశ్శాస్త్ర విభాగం) -1
Bharatiya Ganita Sastra Charitra Jyotissastra Vibhagam 1
Author: Dr. Remella Avadhanulu
Publisher: Shri Veda Bharathi
Pages: 1032Language: Telugu
భారతీయ మహర్షులు “సత్యాన్ని” తెలుసుకోవాలనే దీక్షతో తపస్సు చేసేవారు. ఆ ప్రక్రియలో వారు అతీంద్రియజ్ఞానాన్ని అనుభూతి పూర్వకంగా గ్రహించారు. దానిని కరుణాత్మకభావనతో మనకు వేదాల రూపంలోను, వేదాంగాల రూపంలోను, దర్శనాల రూపంలోను, ఇంకా అనేక రూపాలలో అందించారు. ఆ వేదాంగాలలో ఒక భాగం జ్యోతిశ్శాస్త్రం.
ప్రపంచంలోని అన్ని దేశాలలోను, ముఖ్యంగా భారతదేశంలో, పండితులు లగాయితు పామరులవరకూ, అందరిచేత గౌరవించబడేది జ్యోతిశ్శాస్త్రం. జ్ఞానస్వరూపుడయిన పరమేశ్వరునికి జ్యోతిశ్శాస్త్రం నేత్రం వంటిది. దాని ద్వారా చూడలేనిది ఉండదు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ ఆదరంగా సాంఘికజీవనానికి సంబంధించి గాని, లేక రాజకీయరంగానికి గాని, లేక మతపరమైన కార్యక్రమాలకు సంబంధించిన ఎంత చిన్నపనికైనా గాని, ఈ జ్యోతిర్విద్యను వినియోగించకుండా ముందుకు వెళ్ళరు.
జ్యోతిశ్శాస్త్రము ఒక సమన్వయవిద్య, ధర్మశాస్త్రం దీనిపై ఆధారపడి ఉంది. చక్కటి విషయవిభజనతో కూడిన ఈ శాస్త్రం అతి ప్రాచీన కాలం నుండి తరతరాలుగా పోషింపబడుతూ వస్తోంది. ఈ దేశంలోని మహర్షులచేత శతాబ్దాల, సహస్రాబ్దాల కాలంలో తమ అనుభవాలతో సునిశితంగా పరిశీలించబడి పరీక్షించబడి వివరింపబడింది.
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ గణితానికి సేవలందించిన మహానుభావుల జీవితచరిత్రలను, వారి రచనలను, విశ్లేషణాత్మకంగా క్రోడీకరించి, ఒక సమగ్ర గ్రంథాన్ని శంకరబాలకృష్ణ దీక్షిత్ మనకు అందించారు. ఇందులో 100 పైగా జ్యోతిర్గణితానికి చెందిన గ్రంథకర్తలను, గ్రంథాలను చారిత్రకపద్ధతిలో సవివరంగా పరిచయంచెయ్యడం జరిగింది. ఇటువంటి గ్రంథం అంతకు పూర్వం ఏ భారతీయభాషలోను సంకలనం చేయబడలేదని తెలుస్తోంది. అయితే, అతను అందించిన మూలగ్రంథం మరాఠీభాషలో ఉంది. దానికి డా ఆర్.వి. వైద్య చేసిన ఆంగ్లానువాదాన్ని 1968, 1981లలో రెండు భాగాలుగా ముద్రించడం జరిగింది. మూలగ్రంథ రచయిత అయిన శంకరబాలకృష్ణ దీక్షిత్నకు ఈ దేశం శాశ్వతంగా ఋణపడి ఉంది. జ్యోతిశ్శాస్త్రంపైన, గణితశాస్త్రంపైన అభిమానం ఉన్న ప్రతి భారతీయుడు ఈ గ్రంథాన్ని చదివితీరాలి. ఇందులోని విషయం అంత అపూర్వమైనది.
- డా. రేమెళ్ళ అవధానులు

- ₹120
- ₹450
- ₹72
- ₹810
- ₹72
- ₹540
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72