• Bharateeya Tatwasastramlo Bhavavadam Bhoutikavadam
 • Ebook Hide Help
  ₹ 72
  72
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • భారతీయ తత్వశాస్త్రంలో భావవాదం భౌతికవాదం

  Bharateeya Tatwasastramlo Bhavavadam Bhoutikavadam

  Pages: 174
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఈనాడు మనం చాలా ఆందోళనకరమైన కాలంలో జీవిస్తున్నాం. ఇలాంటి స్థితిలో భారతీయ తాత్విక సంప్రదాయాల విశ్లేషణ కేవలం ప్రాచీనానికి సంబంధించిన జిజ్ఞాస కోసమే కాదు. ఆ విశ్లేషణే చేయకపోతే మనం ఈనాడు ఎదుర్కొంటున్న కఠోర రాజకీయ క్రీడలో నిస్సహాయులమైపోతాం. పచ్చి అభివృద్ధి నిరోధక శక్తులు పైన పేర్కొన్న భావాలను, ధోరణులను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో వారికి కొన్నిసార్లు నయా వలసవాదుల మద్దతూ లభిస్తోంది. ఆ శక్తులే ఎప్పుడూ దేశభక్తియుతమైనవిగా పరిగణించబడుతున్నాయి. భారతీయ విజ్ఞాన స్రవంతి సారాంశం తామేనని ప్రజలను నమ్మించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

ఇదొక మిధ్య. దీన్ని పటాపంచలు చేయాలి. అందుకు ఒకే ఒక మార్గం వాస్తవాలను వెలికి తీయడం. ఇక్కడ నొక్కి చెప్పదలచుకున్న విషయం చాలా సులభమైంది. మన ప్రాచీనులు తమ సుదీర్ఘ… సత్యాన్వేషణలో మనకు అందించినవి కేవలం బూటకపు భావాలే కావు. మన తాత్వికులలో ఒక భాగం మూఢత్వాన్ని హేతురాహిత్యాన్ని, వేదారాధనను, కులద్వేషాన్ని సమర్థించేందుకు పనిచేసి వుండవచ్చు. కానీ ఈ సిద్దాంత శక్తులకు వ్యతిరేకంగా తమదైన మార్గంలో పోరాడిన వారు కూడా వున్నారు. చారిత్రకంగా ఆనాడు వారు కొన్ని పరిమితులు కలిగివుండడం అనివార్యమేననవచ్చు. వారి పాత్రను అతిగా చెప్పటం పొరపాటే అవుతుంది. అయితే వాటిని తక్కువ చేసి చూడటం కూడ పొరపాటే. అది ఈనాటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన తప్పిదం కూడా అవుతుంది. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తి ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు. భారతీయ తాత్విక సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సాధారణ సూత్రీకరణలను అధిగమించాలి. తాత్విక దృక్పథంలో ఏది సజీవమో, ఏది నిర్జీవమో విచక్షణతో విడదీయాలి.

మన తాత్విక సంప్రదాయాల విస్తృతిని క్లిష్టతను గమనంలో పెట్టుకున్నప్పుడు దాన్ని సింహావలోకనం చేయటం తేలికగా, సుఖంగా జరిగే పనికాదు. తాత్వికేతర శక్తులు తాత్విక విషయాల్లో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటున్న దృష్ట్యా ఈ కర్తవ్యం మరింత క్లిష్టమవుతున్నది. అంతేకాక మధ్యయుగ భారతంలో సుదీర్ఘ…కాలం పాటు స్మృతికారులకు అంగీకారయోగ్యమైన భావాలకు పవిత్రగ్రంథాల ఆమోదం లభిస్తుందనే ప్రచారం జరిగింది. కనుక వాటి సాంఫిుక బాధ్యతలను విమర్శనాత్మకంగా అంచనా వేయడంలో చిక్కులు వున్నాయి. సుపరిచితమైన భావాలకు భిన్నంగా చెప్పటం ప్రజలను దిగ్భ్రాంత పరచవచ్చు. ఏమైనా ఈ చిక్కును ఎదుర్కోవానికి నిరాకరించటం అంటే బాధ్యతల నుంచి పారిపోవటమే.

- దేవీప్రసాద్ చటోపాధ్యాయ

Preview download free pdf of this Telugu book is available at Bharateeya Tatwasastramlo Bhavavadam Bhoutikavadam