• Bharatamlo Sarigamalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • భారతంలో సరిగమలు

  Bharatamlo Sarigamalu

  Author:

  Publisher: Victory Publishers

  Pages: 88
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

''వేడుక కోసం ఏదో ఆట ఆడుతుంటే మధ్య నీ ప్రాణాలుపోతున్నట్లు కంగారు పడతావెందుకు'' అన్నాడు శకుని విదురునితో.

అందులకు విదురుని సమాధానం ఇలా సాగింది.

''మేనమామైన నువ్వు తండ్రిలా దుర్యోధనాదులకు మంచిదారి చూపించాలి గాని పెడదారి పట్టించకూడదు. నా భటుల వల్ల మీ కుతంత్రాలన్నీ యెప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నాను. ధర్మమూర్తులైన పాండవులను నీతిగా, వీరోచితంగా ప్రతిఘటిస్తే కర్ణ, దుర్యోధన, దుశ్శాసనులేగాదు ఇటువంటి దుష్టచతుష్టయాలు కోటానుకోట్లు ప్రతిపక్షులై నిలచినను నేను కలత చెందను. కానీ మీరు ఇప్పుడు తలపెట్టిన నీతిలేని పని నీచులు చేసే పని. నీవు ఆడబోయేది మామూలు పాచికలాట అని నీవు భ్రమపుతున్నావు కాని పాండవ కౌరవ జీవితాలతో ఆడే చెలగాటమని గుర్తుంచుకో. నా ప్రాణాలమాట అటుంచి భవిష్యత్తులో మీ అందరి ప్రాణాల భద్రతలను చూచుకోండి'' అన్నాడు విదురుడు.

విదురుని హితవచనాలను, హెచ్చరికలను ధర్మరాజు కూడా అర్థము చేసుకోలేకపోయాడు.

అందుకే విదురుని ఉద్దేశించి ధర్మరాజు ఇలా అన్నాడు.

''ఏదో సరదాగా ఆడే ఈ ఆటలో మీరు ఊహించినంత దుష్పరిణామాలు యేవీ జరగవని నా నమ్మకం. దయచేసి మీరు కూడా కూర్చొని వేడుక చూస్తూ వుండండి. ఈ విషయంలో మీ మాటలు తిరస్కరించినట్లు బాధపడకుండా మీ కొడుకుల ముచ్చట తీరుస్తున్నట్లుగా సంతృప్తి పడండి'' అన్నాడు ధర్మరాజు విదురునితో.

ధర్మరాజునోట ఆ మాటలొస్తాయని వూహించలేదు విదురుడు - ఆ మాటలు వినగానే విదురుడు ఆశ్చర్యపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at Bharatamlo Sarigamalu