-
-
భారతనారీమణులు, బాలజ్యోతులు
BharataNareemanulu Baalajyothulu
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 113Language: Telugu
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించిన భారతనారీమణులు, బాలజ్యోతులు అనే రెండు పిల్లల కథల పుస్తకాల సంపుటం ఈ ఈ-బుక్.
* * *
భారతనారీమణులు అనే ఈ కృతి పిల్లలకు స్ఫూర్తిదాయకంగా రచించిన పదకొండు కథల సంపుటి. ఇందులో నేను ఆయాపాత్రల వివరాలకూ, మక్కికి మక్కీగా పుట్టుపూర్వోత్తరాలకూ, తిథివార నక్షత్రాలకూ, జీవిత ఘటనల పట్టికలకూ అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్కొక్క నారీమణి ఏ లక్షణంవల్ల చరిత్ర ప్రసిద్ధిపొందిందో, తరతరాలకూ ఆదర్శప్రాయంగా ఎందుకు నిలిచిందో - అది మాత్రమే చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఈ కథలు వారి వ్యక్తిత్వాలకు సంక్షిప్త స్వరూపాలు (Micro Film) అన్నమాట- కొండ అద్దంలో కొద్దిగానే ఉన్నట్టు. సంక్షేపంగా ఉన్నంత మాత్రాన ఫోటోల్లోని కవళికలు అదృశ్యంకావు. బీజరూపంలో ఉంటాయి.ఎంతగా విస్తరిస్తే అంత పెంపొందుతాయి. కథ నిడివి తగ్గి సారాంశం ఏకధాటిగా అందాలని చేసిన ఒక ప్రయత్నం ఇది. కథానాయికల సంస్కారశక్తి సూటిగా రసగుళికలాగా పిల్లలకు ఆస్వాదయోగ్యం కావాలని ఆశయం. అందువల్ల పసిమనసులు ప్రభావితాలై జీవనరీతులు దిద్దుకోవాలని ఆశ.
* * *
నేటి బాలలే రేపటి పౌరులు. జాతి సౌభాగ్యాలు. ఈ బంగారాల ఈనాటి మంచి సంస్కారమే రేపటి గొప్ప దేశ సంస్కృతి. తెల్లని వస్త్రం మీద అద్దిన రంగుల్లాగా చిన్నతనంలో అలవరచుకున్న ఉత్తమ గుణాలు పిల్లలకు గొప్ప జీవితాలను అందిస్తాయి. జాతి ప్రగతిని మహోన్నతంగా నిలుపుతాయి. బాలలూ! అందుకే మీకీ కథలు.
ఇందులో మొదటి పది అచ్చంగా చిన్న పిల్లల బాల్యకథలు. రెండో పది బాల్యంలో పెంపొందించుకున్న గొప్ప గుణాల కారణంగా పెద్దయింతర్వాత మహాత్ములుగా మారి మానవజాతికి పెద్ద పేరు తెచ్చిన మహితాత్ముల కథలు. ఇవి చదివి విూ ప్రవర్తనలు పవిత్రంగా, మహోన్నతంగా దిద్దుకుంటారు కదూ!
- వసునందన్

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81