-
-
భారత స్వతంత్ర పోరాటం(1857 - 1947)
Bharata Swatatra Poratam 1857 to 1947
Author: Bipin Chandra
Pages: 640Language: Telugu
భారత స్వతంత్ర పోరాటంపై సమగ్రమైన, తులనాత్మకమైన అధ్యయనాలు ఇప్పటివరకు వెలువడలేదనే చెప్పవచ్చు. తెలుగులో అయితే అసలే అందుబాటులో లేవు. సుప్రసిద్ధ చరిత్రకారులు ప్రొ. బిపన్ చంద్ర, బృందం రచించిన ఈ గ్రంథం ఆ కొరతను చాలావరకు తీరుస్తుంది. స్వతంత్రపోరాటంపై లోగడ వెలుబడిన అనేక గ్రంథాలున్నప్పటికీ అవి గాంధీజీ నాయకత్వంలోని అహింసోద్యమమే ఏకైక పోరాటం అన్న ధోరణితో సాగుతాయి. ఇతర ప్రజాఉద్యమాలను, సాయుధ పోరాటాలను పూర్తిగా విస్మరిస్తాయి. ఒక వేళ ప్రస్తావించినా అది మొక్కుబడిగానే ఉంటుంది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన పోరాటం స్వతంత్రోద్యమంలో ప్రధాన స్రవంతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఇతర ప్రజాపోరాట స్రవంతులకు కూడా సముచిత స్థానం కల్పించినప్పుడే అది తులనాత్మకమైన స్వతంత్ర పోరాట చరిత్ర అవుతుంది. ఇఎంఎస్ నంబూద్రిపాద్ లాంటి నాయకులు ఒక్కచేతిమీద అలాంటి సమగ్ర దృష్టితో బృహత్తర రచనలు చేసినప్పటికి, ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి సమిష్టి అధ్యయనంతో, పరిశోధనతో వెలువరించిన మొదటి రచన ఇది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
- ప్రచురణ కర్తలు
