• Bhale Bhale Manchi Rojulule
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భలే భలే మంచి రోజులులే...

    Bhale Bhale Manchi Rojulule

    Publisher: Shaili Publications

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆరోజు ఆదివారం. నారాయణ రూంలో కూర్చుని పోటీకి పంపవలసిన కథని ఫెయిర్ చేస్తున్నాడు. శశాంక్ పనివుండి బయటికి వెళ్ళాడు.
అంతలో మెట్ల మీద కాలిపట్టా మువ్వల చప్పుడు అవడంతో నారాయణ తలెత్తి చూశాడు. తలకు స్నానం చేసి, ఆర బెట్టుకుంటున్న కురులతో ఎర్రని పరికిణీ మీద తెల్లని వోణీలో విరిసిన గులాబీలా రాధ గుమ్మం ముందు చిరునవ్వుతో నిలబడివుంది.
ఒక్క క్షణం నారాయణ ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయాడు. కారణం తను ఈ గదిలో దిగి వారం రోజులయింది. ఇంతవరకూ రాధ కంటికి కన్పించలేదు.
అంతలోనే, నారాయణ ఆలోచనలను చెదరగొడుతూ అంది రాధ.
"నమస్కారం నారాయణగారూ, లేక ‘నాని’ అన్న కలం పేరుతో కథలు రాసే రచయితగారూ, మీరు రచయిత అని నా స్నేహితురాలు చెప్పింది. ఆమె అన్నయ్య మీ కాలేజీలోనే చదువుతున్నాడట".
ఇదిగోనండి ఈ వారం వార పత్రికలో మీరు వ్రాసిన "అలలు-శిలలు" కథ చాలా బాగుంది. పారితోషకం అందాకా పార్టీ మర్చిపోకండి. అంటూ గలగలా ప్రవహించే సెలయేరులా మాట్లాడేసింది రాధ. చేతిలోని వారపత్రికను నారాయణకు అందించింది.
"ఎంతమాట! తప్పకుండాను. అరే నిలబడే మాట్లాడేస్తున్నారు. రండి కూర్చోండి!" అంటూ కుర్చీ చూపించాడు నారాయణ తను వ్రాస్తోన్న కాగితాలు పెన్ను పక్కన పెడుతూ.
"అయినా దేవతలు దివినుండి భువికి దిగుతారు. అని చదివాను, విన్నాను. మరి ఈ దేవత క్రింది నుండి మెట్లమీదుగా పైకి రావడం విశేషం" అన్నాడు నారాయణ రాధ వైపు చూస్తూ చిరునవ్వుతో మళ్ళీ తనే.
"అవునూ! మీ మాటల్ని బట్టి చూస్తోంటే, మీకు కూడా సాహిత్యంలో బాగా పరిచయం వున్నట్టనిపిస్తోంది సుమండీ. ఒకవేళ మీరుకూడా కథలూ, నవలలూ గట్రా రాయడం... నిజం చెప్పండి" అన్నాడు నారాయణ.
“అబ్బే! అలాంటిదేమీ లేదుగానీ అండీ, సాహిత్యం చదవడం ఇష్టం" అంది రాధ.
అలాగ వాళ్ళిద్దరూ కొంతసేపు, కృష్ణశాస్త్రి, ముళ్ళపూడి, యద్దనపూడి, రావిశాస్త్రి, మల్లాది, యండమూరిల రచనలు గురించి అనేక విషయాలు చర్చించుకున్నారు సాహితీ పరంగా. "మంచి సాహిత్యమే చదివింది." అనుకున్నాడు నారాయణ.
అంతలో శశాంక్ లోపలికి వచ్చాడు. రాధ శశాంక్‌కు నమస్కరించింది. మరుక్షణం ఇద్దరి వద్దా సెలవు తీసుకుని మువ్వల చప్పుడు చేసుకుంటూ, మెట్లు దిగి వెళ్ళిపోయింది రాధ.

Preview download free pdf of this Telugu book is available at Bhale Bhale Manchi Rojulule