-
-
భక్తశిఖామణులు, భగవద్రామానుజులు
Bhakta Sikhamanulu Bhagavdramanujulu
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 77Language: Telugu
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించిన "భక్తశిఖామణులు", "భగవద్రామానుజులు" అనే రెండు పుస్తకల సంపుటం ఈ ఈ-బుక్.
* * *
భక్తశిఖామణులు అను యీ సుందర గేయకావ్యమునందు భారతీయులచే సదా ఆదరించబడుతున్న సుప్రసిద్ధ మహా భక్తులలో కొంతమందిని ఎంపికచేసి వారిపై రచించిన యీస్తుతి గీతాలు పరమరమ్య రసగుళికలు. శివ కేశవ భక్తులు యీ కావ్యములో కీర్తించబడినారు. ఎందరో ''భక్తశిఖామణుల''ను అపారమైన శ్రద్ధా భక్తులతో సంస్తుతి చేసి తద్వారా వారి వారి విశిష్టతలను బహు సుందరమైన రీతిలో తెలుపుతూ తమ యీ గేయ మాలికను సృజియించిన ధన్యులు శ్రీవసునందన్ గారు.
- డా. మహాభాష్యం చిత్తరంజన్
* * *
కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించి అందించిన "భగవద్రామానుజులు" గేయమాలిక భగవద్రామానుజ జీవనములోని కొన్ని ముఖ్యమైన ఘట్టములను చక్కగా సరళముగా సుబోధముగా మృదుమధురముగా రసస్ఫోరకముగా అందించుచున్నది. గురువుగారి కటాక్షమే భగవానుని మాయను తొలగించును అనెడి సకల శాస్త్ర రహస్య సారమును అందించియున్నారు. భగవద్రామానుజులకు ఉభయవిభూతుల ఆధిపత్యమును భగవంతుడు ప్రసాదించుటను, గోపురమెక్కి వారు తిరుమంత్రార్థమును అందరికీ కృప చేయుటను, అందరికీ మోక్షము వచ్చినచో నాకు నరకమొచ్చినా సంతోషమే అనెడు కరుణా రస ప్రవాహ భరిత హృదయమును చాటుచు రామానుజ పాదద్వయము మృత్యుంజయ ప్రసాదకమని తెలియజేసిరి.
మతమె సన్మతము, సమ్మతము సకల లోకములకు ఇత్యాది విశిష్టాద్వైత సిద్ధాన్త రహస్యములను రామానుజాచార్య దివ్యజీవనములోని భవ్య ఘట్టములను అందించి మహోపకారమొనర్చినారు. దీనిని చదివి తెలిసి లోకులు కృతార్థులు కావాలి.
- డా. కందాడై రామానుజాచార్య

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81