-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
భజే శ్రీనివాసమ్ (free)
Bhaje Srinivasam - free
Author: Viswapathi
Publisher: Shri Designs
Pages: 134Language: Telugu
ఈ విశ్వం మొత్తం శ్రీమన్నారాయణుని స్వరూపమే నిండి ఉన్నది. ‘విష్ణువు' అంటే సర్వ వ్యాపకుడు అని అర్థం. సూర్య చంద్రులు, ఆకాశంలో మనకు కనపడే అనేక గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఆ పురుషోత్తముని స్వరూపంలోనివే. పురాణాలలో ఎన్నో చోట్ల శ్రీమన్నారాయణులవారి విరాట్ స్వరూపం గురించి చక్కగా వివరించబడింది.
ఆకాశంలో అనేక నక్షత్రమండలాలు ఉన్నాయి. వాటిలో రవి మార్గంలో వచ్చే 27 నక్షత్రాలే అశ్వినీ నుంచీ రేవతి వరకు వచ్చే నక్షత్ర సమూహం. చంద్రునికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ రోజు ఆ నక్షత్రానికి చెందినదిగా వ్యవహరిస్తారు. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అనేక ఆకృతులను కలిగి ఉంటాయి. ఇవి కూడా ఒక్కొక్క నక్షత్రాలు కావు. అశ్విని అంటే గుర్రపు ముఖం ఆకారంలో కనబడే మూడు నక్షత్రాల సమూహం. అలాగే భరణి అంటే రెండు నక్షత్రాలు. కృత్తిక అంటే ఆరు నక్షత్రాల సమూహం. కృత్తికలో జన్మించినవాడే షణ్ముఖుడైన కుమారస్వామి.
ఈ నక్షత్రాల ప్రభావం మానవులపై ఎంతో ఉంటుంది. ఒక్కో నక్షత్రం నాడు జన్మించిన వారి గుణగణాలు, అలవాట్లు, నడవడిక ఒక్కోలా ఉంటాయి. ప్రతీనక్షత్రానికి ఒక్కో అధిదేవత ఉంటుంది. పూర్వకాలంలో ఎవరైనా జన్మిస్తే, ఆ సమయంలో ఉండే నక్షత్రానికి చెందిన అక్షరం ప్రకారం, ఆ అక్షరాలతో ప్రారంభమయ్యేలా నామకరణం చెయ్యడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఈ సంప్రదాయం చాలా తగ్గినట్లు కనిపిస్తున్నది. నిజానికి ఆవిధంగా పేరు పెట్టుకొనడం చాలా శ్రేయస్కరం. ఉదాహరణకు అశ్వినిలో పుట్టినవారు చూ, చే, లో, ల అనే అక్షరాలతో ప్రాంభమయ్యేలా నామం పెట్టుకుంటే మంచిది. ఆ అక్షర ఉచ్చారణ వలన వచ్చే శబ్ద తరంగాలు వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అక్షర మంటే క్షరము కానిది. నక్షత్రమంటే కూడా నశించనిది అని అర్థం. ఇలా ప్రతీ అక్షరానికీ, ప్రతీ నక్షత్రానికీ అద్భుతమైన శక్తి వున్నది. ఈ విశ్వం మొత్తం ఎంతో తేజోవంతమైన కాస్మిక్ తరంగాలతో నిండి ఉంది. ఇప్పటిదాకా ఏ శాస్త్రజ్ఞులకూ అందని ఎన్నో దివ్యతరంగాలు ఈ విశ్వంలో నిత్యం ప్రసరిస్తున్నాయి.
ఈ పుస్తకం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతోనూ, సప్తఋషుల వంటి తేజోసంపన్నుల అనుగ్రహంతోనూ రాయబడింది. ఈ పుస్తక రచన సాగుతున్నప్పుడు నక్షత్ర మండలాలలోని ఎంతోమంది దివ్యపురుషులు దర్శనమిచ్చారు. ఈ రచన మొత్తం వారి అనుగ్రహంతో, ఆ దేవర్షుల పర్యవేక్షణలో జరిగినదే. ఈ పుస్తకంలోని ప్రతీ అక్షరం శ్రీనివాసుని అనుగ్రహమే తప్ప మరొకటి కాదు.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
