-
-
భాగవతంలో చిన్నకథలు
Bhagavathamlo Chinnakathalu
Author: Prayaga Ramakrishna
Publisher: Prayaga Ramakrishna
Pages: 170Language: Telugu
Description
భాగవతమైన భాగవతం ఆధ్యాత్మిక లోతులను కలిగిన ఆనంద రసమయ సాగరం. భవరోగ నివారణకు దివ్య ఔషధం. ఇటువంటి భాగవతాన్ని చదువరులకు ఆసక్తి కలిగించే విధంగా చిన్న కథల రూపంలొ అందించేందుకు ప్రయత్నించిన శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి కృషి అభినందనీయమైనది. సరళమైన శైలిలో సర్వజన రంజకంగా ఆసక్తికరంగా ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
- స్వామి జ్ఞానదానంద
* * *
ప్రయాగ రామకృష్ణ గారి భాగవతంలో చిన్నకథలలో అటు వేదాంతం, తాత్త్వికధోరణి, ఇటు కవిత్వ అభివ్యక్తీకరణ చెట్టాపట్టాలేసుకుని చిందులు తొక్కాయి.
ఈ భాగవతంలోని చిన్న కథలు, నవ్య వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమై ప్రజామోదాన్ని పొందగలగటానికి భాగవతంలోని నిత్యమైన సత్యమైన ఆకర్షణ ఒక ఎత్తైతే - రామకృష్ణగారి కథాకథనశైలీమాధుర్యం మరో బలవత్తరమైన ఆకర్షణ అయి నిలిచింది.
- దత్తప్రసాద్ పరమాత్ముని
Preview download free pdf of this Telugu book is available at Bhagavathamlo Chinnakathalu
Login to add a comment
Subscribe to latest comments
