• Bhagavata Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భాగవత కథలు

    Bhagavata Kathalu

    Pages: 527
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భాగవతము తెలిసిపలుకుట చిత్రంబు అని పోతన మాట వేదమనే కల్పవృక్షం నుండి జారి పడిన పండుగా, భక్తి బంధురమైన రచనగా ప్రసిద్ధి పొందిన గ్రంథరాజం శ్రీమద్భాగవతం.

ఆంధ్ర భాగవతం ఆంధ్ర భాషకు అనన్య సామాన్యమైన అలంకారంగా విలిసిల్లుతున్నది. అందలి పద్యాలు ప్రజానీకంలో ఆబాలగోపాలం ప్రచారమై భగవద్భక్తిని విస్తరింపజేశాయి. విన్నంత మాత్రాన వీనులవిందు కావడమేకాక అమదానందం చేకూర్చే పోతన రచన నిరుపమానమైన కృతిగా ప్రశస్తి పొందింది.

ఈ గ్రంథాన్ని అనేకులు అనేక విధాల పఠన పాఠన ప్రవచనాదులతో ఉపాసించి తరించారు. శ్రీ సుబ్రహ్మణ్యపిళ్ళె గిరిధరన్‌గారు తనవంతు కైంకర్యముగా భాగవత సేవకు పూనుకొని 1116 అడుగుల పొడవుగల గద్య భాగవతాన్ని వ్రాసి ధన్యులయ్యారు.

ఇప్పుడు శ్రీ గిరిధరన్‌గారు నాడు శుకుడు ఏడు దీనాలు పరీక్షిత్తుకు బోధించిన భాగవతాన్ని సప్తదిన పఠనీయ గ్రంథంగా విభజించి అందలి కథా కథనాది విశేషాలను సులభ సుందరమైన తెలుగులో రచించి ప్రకటించడం ఆంధ్ర జనులకందరికీ ఆమోదదాయకమైన విషయం.

తానొక్కడు చదువుకొని విద్యావంతుడనిపించుకుంటే చాలదు. ఆ చదువును పది మందికీ ఉపయోగపడునట్లు వినియోగించువాడే ధన్యజన్ముడు. తన విద్యా పరిశ్రమను భాగవత కథా వ్యాప్తికీ ఈ రీతిగా వినియోగించి ఫలవంతం చేసిన గిరిధరన్‌గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

- డా. సముద్రాల లక్ష్మణయ్య

Preview download free pdf of this Telugu book is available at Bhagavata Kathalu