• Bhagavata Geyasudha 1
  • fb
  • Share on Google+
  • Pin it!
 • భాగవత గేయసుధ - 1

  Bhagavata Geyasudha 1

  Author:

  Pages: 125
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

భాగవత గేయసుధ - 1 (సంక్షిప్త భాగవత సుధ - గేయ రచన - మొదటి భాగం)

పోతన భాగవత మధురిమలకు గేయరూప అనుసృజన

* * *

"సంక్షిప్త భాగవత సుధ" పద్య కావ్యం కాదు. గద్యమూ కాదు, చంపువు అసలే కాదు. గేయ కావ్యం. చక్కని ఊపుతో పరుగులెత్తుతున్న రచన. గానయోగ్యమైన సార్థక రచన. మొదటి భాగంలో తొమ్మిది స్కంధాలు ఉన్నాయి. ఈ గ్రంథం చదివితే అసలు భాగవతంలో ఏమున్నదో స్థూలంగా తెలుస్తుంది. ఏయే కథలున్నాయి, ఏయే విషయాలు, విశేషాలు ప్రకటించబడ్దాయి, ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఏమి చెప్పారో పస్ఫుటపడుతుంది. ఇది నిజంగా భాగవత సుధాకలశమే! ఆరగ్రోలడమే పఠితృమహాశయుల పని.

- డా. సి. హెచ్. బాబావలి

* * *

మొదటి భాగంలోని ముఖ్యాంశాలు:

1. మొదటి స్కంధము: - కథా ప్రారంభం, అతి సంగ్రహంగా ముఖ్య ఘట్టాలు. కలి ప్రవేశము, విప్రతాపము నొందిన పరీక్షిత్తు ప్రాయోపవేశము, శుక మహర్షి పరీక్షిత్తు వద్దకు ఏతెంచుట.

2. రెండవ స్కంధము: - శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గము దెలుపుట, శ్రీమన్నారయణుని లీలావతారములు, భాగవత ప్రశంస, నారాయణుడు బ్రహ్మతపమునకు వరములిచ్చుట.

3. మూడవ స్కంధము: - విదురమైత్రేయ సంవాదము, శ్రీయజ్ఞవరాహావతార వర్ణనము, జయవిజయులకు సనక సనందనాదుల శాపము, బ్రహ్మ సృష్టి నిర్మాణము, కపిలావతారము.

4. నాల్గవ స్కంధము: - దక్షయజ్ఞము, ధృవోపాఖ్యానము మొదలైనవి

5. ఐదవ స్కంధము: - మనువంశ క్రమము, భోగోళ, ఖగోళ, నరకలోక వర్ణనములు.

6. ఆరవ స్కంధము: - అజామిళోపఖ్యానము, విశ్వరూపుని వృత్తాంతము, వృత్తాసుర సంహారము, నారాయణ కవచము మొదలగునవి.

7. ఏడవ స్కంధము: - ప్రహ్లాద చరిత్ర, ఇతరములు.

8. ఎనిమిదవ స్కంధము: - గజేంద్ర మోక్షణ గాథ, క్షీరసాగర మధనం, వామనావతార చరిత్ర.

9. తొమ్మిదవ స్కంధము: - సూర్య, చంద్ర, యదు వంశముల రాజుల వృత్తాంతములు.

Preview download free pdf of this Telugu book is available at Bhagavata Geyasudha 1