-
-
భగవద్గీత - వ్యక్తిత్వ వికాసం
Bhagavadgita Vyaktitva Vikasam
Author: Dr. V. Nagarajya Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 125Language: Telugu
భగవద్గీత – వ్యక్తిత్వ వికాసం
'సారస్వత కళానిధి'
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
ఎం.ఏ, పిహెచ్.డి, తెలుగు, ఎం.ఏ. (సంస్కృతం)
ప్రపంచ వాఙ్మయంలో భగవద్గీతకు ఒక అపూర్వమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు. సమున్నత వ్యక్తిత్వ సాధనకు ప్రాచీన మహర్షులు అందించిన జీవనశాస్త్రం భగవద్గీత. వ్యాపారవేత్తలకు అభివృద్ధి మంత్రం. యోగసాధకులకు వికాససూత్రం. నాయకుడు ఎలా ఉండాలో నిరూపించింది. మనిషి సాటి మనిషితో ఎటువంటి అనుబంధం కలిగి ఉండాలో ఉదహరించింది. కర్తవ్య విముఖులై నిరాశలో మునిగిపోయిన యువతకు కర్తవ్యోపదేశం చేసింది. వేదాలలో, ఉపనిషత్లులో పేర్కొన్న సత్య ధర్మ మార్గాన్ని ఎలా చేరుకోవాలో రూట్‌మ్యాప్ వేసి చూపించింది. అపమార్గంలో ప్రవేశించి తనకూ, సమాజానికి ద్రోహం చేసే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవన మార్గంలోనికి ప్రవేశించటానికి అనువైన రీతిలో ఈ గ్రంథరచన సాగింది. వ్యక్తి అంటే పుట్టి, పెరిగి, వెళ్ళిపోయే జంతువు కాదని, అతనిలోని మానవత్వం బ్రాహ్మీస్థితికి చేరి పరిపూర్ణమైన పరిణామం పొందటమే భారతీయ మహర్షులు మనకు బోధించిన సిద్ధాంతం అని ఈ గ్రంథం నిరూపిస్తుంది.

- FREE
- FREE
- FREE
- ₹86.4
- ₹162
- ₹135.6