-
-
భగవద్గీతా సారసంగ్రహము
Bhagavadgita Sarasangrahamu
Author: P.R. Murahari
Publisher: Self Published on Kinige
Pages: 145Language: Telugu
మానవాళికి అతిపవిత్రమైన భగవద్గీత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి, పెక్కు రచయితలు మిక్కుటంగా రాసారు. అయినా అలాంటి మహోద్గ్రంథాలు ఎన్నివేలు వచ్చినా మిక్కుటం కాజాలవు. ఈ చిన్నిపుస్తకాన్ని వ్రాయడంలోని ముఖ్యోద్దేశ్యం తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు చదివి అర్థం చేసుకొనే వసతి కల్పించడమే! కాన్వెంటుల్లో విద్యను సాగిస్తున్న అనేక విద్యార్థులు మరియు తదితరులు కఠినమైన భాషలేకుండా సులభంగా చదువుకోడానికి ఇందులో వీలు కల్పింపబడింది.
‘అమలిన తారకా సముదయమ్ముల నెన్నను’ - అని ఆదికవి నన్నయ చెప్పినట్లుగా భగవద్గీతపై వెలుగులో ఉన్న అనేక పుస్తకాలను చదివి అనువదించుకొని, అర్థం చేసుకొని, జీర్ణించుకొని వ్రాయడమనేది ఒక బృహత్కార్యమే అయినా దాన్ని చేయించే వాడు శ్రీకృష్ణ పరమాత్మయే యని తలచి నేనుసైతం భగవత్కార్యంగా భావించి, దీనిని రచించాలని తలపెట్టాను. ఫలితాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, చదువరులకు వదలివేసి, చింతారహితునిగా విశ్రమించ దలచాను.
- పె.రా. మురహరి
