-
-
బేతాళ ప్రశ్నలు
Bethala Prasanalu
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 326Language: Telugu
“రాత్రి చనిపోయింది బాలుడు కాదు” అన్నాడొక వ్యక్తి. “వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది” అన్నాడు రెండో మనిషి. “కాదు నిశ్చయంగా వృద్దుడే” అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమా, ఒకరు అబద్దమూ చెపుతుంటే, చని పోయిందెవరు? వృద్ధుడా? బాలుడా? వృద్దురాలా?
“పని చేసే కొద్దీ మరింత అభివృద్ది చెందే అవయవం మెదడొక్కటే” అన్నాడు ఐన్స్టీన్. పాలిష్ చేసిన బూట్లు ఎందుకు మెరుస్తాయి? రెండు+రెండు/ రెండు ఎంత? ఎడిసన్ తయారు చేసిన మొదటి బల్బు ఇప్పుడెక్కడ వుంది? కోళ్లు గొర్రలకు రెట్టింపు. వాటి తలల మొత్తం 99. ఏవేవి ఎన్నెన్ని?
పిల్లల్లో లెక్కలు, విజ్ఞానశాస్త్రంపట్ల భయాన్నితగ్గించి ఉత్సాహాన్ని పెంచే పుస్తకం ఇది. ఛార్టెర్డ్ అకౌంటెంట్ గా, ఎన్నో ఇంటర్యూ బోర్డుల్లో మెంబర్ గా వున్న అనుభవంతో, ఏ ప్రశ్నలకి ఎలా సమాధానాలు చెప్పి ఉద్యోగం సంపాదించాలో వివరిస్తూ, యువకుల్లో లెటరల్ థింకింగ్ ని పెంచటానికి చక్కటి లెక్కల రూపంలో యండమూరి వీరేంద్రనాధ్ తయారు చేసిన అంతరంగ వికాస పుస్తకం ఈ బేతాళ ప్రశ్నలు.
సాయంత్రంపూట కుటుంబమంతా సరదాగా కలసి కూర్చుని ఆడుకోవటానికి ఎన్నో ఇంటెలిజెంట్ + ఫన్నీ పజిల్స్ తో మెదడుకి వ్యాయామం నేర్పే ఇటు వంటి పుస్తకం ఇంతవరకూ తెలుగులో రాలేదని చెప్పటానికి ఏ సందేహమూ లేదు.
- - పబ్లిషర్స్

- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4