-
-
బేతాళుడు చెప్పిన కథలు
Betaludu Cheppina Kathalu
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 57Language: Telugu
"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలోని బేతాళుడి కథల సంకలనం ఈ ఈ-బుక్. ఇందులో 20 కథలు ఉన్నాయి.
* * *
బేతాళుడు కథ చెప్పి, ''రాజా ! మూఢ నమ్మకాలు ఎంతటి దారుణమైన పర్యవసానాలను కలిగిస్తాయో ఆదిత్యవర్మకి తెలుసు. అందువల్లే అతడు అరణ్య మధ్యంలో ఉన్న గూడేనికి వెళ్ళి పూజారి రహస్య కార్యకలాపాలను కనుగొనడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శ్రమించాడు. అటువంటి ఆదర్శవంతుడు తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు? కొండపై నుంచి కిందపడడంతో ప్రాణభయంతో అతనిలోని ఆదర్శ భావాలు అడుగంటిపోయాయా? ఇంకేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది,'' అన్నాడు.
దానికి విక్రమార్కుడు, ''విశ్వాసాలన్న తరువాత ఏవి మంచి విశ్వాసాలు? ఏవి మూఢ విశ్వాసాలు? అని విడదీసి తేల్చిచెప్పడం అంత సులభం కాదు. దేశ కాల పరిస్థితులను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎక్కువ మందికి మేలు కలిగించినంతకాలం ఏ విశ్వాసాన్నయినా తప్పు పట్టలేము. అనుదిన జీవితంలో ఎన్నో విశ్వాసాలు కనిపిస్తూంటాయి. దైవభక్తి, పాపభీతి మొదలైనవి ఇలాంటి విశ్వాసాలే. కొన్ని పరిస్థితులలో దైవభీతి మనుషుల్ని హద్దుల్లో ఉంచుతాయి. కొన్ని దశలలో అవి లేకపోతే విచ్చలవిడితనం, అరాచకం ప్రబలే ప్రమాదము ఉన్నది. అలాంటి ఒక విశ్వాసాన్ని నిలబెట్టనికి మహాబలుడు చేసిన ప్రాణ త్యాగం, ఆదిత్యవర్మ కళ్ళు తెరిపించింది. పైగా, రామశాస్త్రి తన స్వార్థం కోసం దేవతను అడ్డుపెట్టుకుని నాటకం నడిపించలేదు. గూడెం ప్రజల మేలుకోరి, న్యాయాన్యాయాలు విచారించి, ధర్మా ధర్మాలు పరిశీలించి, దేవతపై భారం వేసి బలుడికి శిక్ష విధించాడు. అందువల్ల పూజారిని నిందించడం భావ్యం కాదు. ఇవన్నీ ఆలోచించడం వల్లే ఆదిత్యవర్మ తాను కనుగొన్న రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు,'' అన్నాడు.
* * *
చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటుంది.
గమనిక: "బేతాళుడు చెప్పిన కథలు" ఈబుక్ సైజు 6.91 mb
