-
-
బీస్ 2008
Bees 2008
Author: Mydhili Venkateswara Rao
Pages: 200Language: Telugu
తేనెటీగలు..... రాక్షస తేనెటీగలు. మధురమైన తేనెని ఒలికించే తేనెటీగలు కావవి... ఆఫ్రికన్ పాయిజన్ బీస్... ఊరిమీద పడితే ఊరే వుండదు. నగరం మీద వాలితే నగరమే మిగలదు.
అలాంటి ప్రమాదకరమైన బీస్ ఇండియాలో ప్రత్యక్షమైతే?
ఆందోళన... భయం ... ఉద్రిక్తత .... వెరిసి పుకార్లు కలియుగాంతం వచ్చేసింది.. ప్రపంచం చివరి రోజులు....
వీరభోగ వసంతరాయల వారి ఆగమనానికి ఇదే దృష్టాంతము...
ఓ పక్క విషపు తేనెటీగలు... మరో పక్క ప్రజల ఆందోళన కలిసి... డెడ్లీ బీస్... జగత్ ప్రళయం.... ఈ రెంటి సమ్మేళనమే...
బీస్ 2008
ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన
* * *
ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు అవతల టక్కున ఫోన్ తీశారు.
''హలో....'' అన్నాడు నమ్రతగా.
''అసలు మీరు పనిచేస్తున్నారా? లేక నిద్రపోతున్నారా?''
ఆయనలో అంత కోపం, దురుసుతనం ఎప్పుడూ చూడలేదు... వినలేదు..
''సారీ సర్... బీస్ ఎక్కడున్నాయో దాదాపు తెలుసుకున్నాం. వాటిని ఏరివేయటానికే బైలుదేరుతున్నాం.''
''నేను అడుగుతున్నది అదికాదు. బీస్ గురించి, వాటి ప్రమాదం గురించి ఎవరు లీక్ చేశారు? ప్రజల్లో దాని గురించి ఎన్ని పుకార్లు వెలువడుతున్నాయో, ఎంత ఆందోళన చెందుతున్నారో మీకసలు తెలుసా?''
''ఆందోళనా!?'' నోరు వెళ్ళబెట్టాడు చక్రవర్తి.
''మొత్తం నగరమంతా దీని గురించే చర్చ. రీసెర్చి సెంటర్లో అంతా చనిపోవటం దగ్గర్నించి ఈ రోజు బీస్ కాటుకు బలి అయిన శ్రీకాంత్ ఫ్యామిలి వరకూ పూసగుచ్చినట్టు చర్చించుకుంటున్నారు. ఏ నిమిషంలో ఏమౌతుందోనని జనం ఝడుసుకు చస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో వున్న నాకు ఈ విషయం తెలుసు. కాని మీరు మాత్రం తాపీగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. అంతేనా?''
చక్రవర్తికి గుండె ఆగినంత పనయ్యింది. అప్పుడే ప్రజల్లో వ్యాపించిందా? ఇప్పుడు వాటిని కంట్రోల్ చెయ్యటమంటే? దానికి సమాధానమన్నట్టు అవతల ఆయన చెప్పారు.

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28