-
-
బాతుల నుంచి వచ్చాం
Batula Nunchi Vacham
Author: Ruby Hembrom
Publisher: Manchi Pustakam
Pages: 36Language: Telugu
Description
బాతుల నుంచి వచ్చాం
తిరిగి చెప్పింది : రూబి హెమ్బ్రాం
బొమ్మలు : బోస్కి జైన్
ఈ భూమి ఎలా ఏర్పడింది? రకరకాల జంతువులు, వృక్షజాలం ఎలా ఏర్పడ్డాయి? మనుషులు ఎలా పుట్టారు? సూర్యుడు, గ్రహాలు, ఇతర నక్షత్రాల రహస్యాలు ఏమిటి? ఇటువంటి ప్రశ్నలు మనుషులను మొదటి నుంచి ఆలోచింపచేస్తూ వచ్చాయి. వివిధ తెగలు, జాతుల ప్రజలు ఈ ప్రశ్నలకు తమకు తోచిన, ఊహకు అందిన జవాబులు చెప్పుకున్నారు. శాస్త్ర విజ్ఞానం అంతగా అభివృద్ధి కాని ఆ రోజుల్లో మనుషులను పీడిస్తున్న ప్రశ్నలకు ఇవి సంతృప్తికరమైన సమాధానాలు అనిపించాయి. ఈనాడు మనకు అందుబాటులో ఉన్న విజ్ఞానంతో అవి సహేతుకమైనవి కావు అని తెలిసిపోతుంది. అయినప్పటికీ మానవ విజ్ఞాన పరిణామం తొలి రోజులలోని కథలను, అద్భుతమైన కల్పనలను ఈనాటికీ మనం తెలుసుకోవాలి, జాతి సంపదగా భద్రపరుచుకోవాలి. అలాంటి అనేకానేక సృష్టి కథలలో సంతాలులకు చెందిన ఒక సృష్టి కథ ఇది.
Preview download free pdf of this Telugu book is available at Batula Nunchi Vacham
Login to add a comment
Subscribe to latest comments
