• Batikina kodi
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బతికినకోడి

  Batikina kodi

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

హైదరాబాదులో బోనాలు ఎంత ఫేమసో కోళ్ల మంగారం బొమ్మలు అంత ఫేమసని అంటారు. అటువంటి ఒక శూద్ర చిత్రకారుడి జీవనచిత్రం, బతికిన కోడి.

రచయిత గురించి "రాజులమీద, రాచకుటుంబాలమీద, తెగబలిసినవారిమీదా మాత్రమే రష్యాలో సాహిత్యసృష్టి జరుగుతున్నవేళ నికోలాయ్ గోగోల్ అనే ఆసామి ఒక పేద గుమాస్తా చలికోటుమీద ఒక కథ వ్రాశాడు. సామాన్యులు కూడా కథా వస్తువులు కాగలరని రష్యా రచయితలకు అంతవరకూ తెలీదు. అందువల్లే యావత్ రష్యన్ సారస్వతం కూడా గోగోల్ గ్రేట్‌కోట్‌నుండే పుట్టిందని డాస్టోవిస్కి అప్పట్లో ప్రకటించారు. దినపత్రికల్లో మహానుభావుల జీవితాలమీదా చలోక్తులమీదా, చమత్కారాలమీదా, గొప్పవారి జీవితాలమీదా రకరకాల ఆర్టికల్స్ రావడం రివాజు. అట్టి దినపత్రికల్లో తోపుడుబళ్లవాళ్ల మీదా, ఫుట్‌పాత్ నివాసులమీదా, జోక్స్ పుస్తకాలు వ్రాసే వాళ్లమీదా వ్రాయడం జర్నలిస్టుల సామాజిక దృష్టిలో వచ్చిన మార్పుకు సంకేతం" అని 'కోళ్లమంగారం మరికొందరు' పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ పతంజలిగారు వ్రాశారు. నిజమే. రమేష్‌బాబు ఇటువంటి సామాజిక మార్పులో భాగంగా అందివచ్చిన ఒకానొక యువ పాత్రికేయుడు. జర్నలిజంలో పుష్కరకాలంగా ఉన్నాడు. సామాన్యుల జీవిత పరిచయాలే ఇతడికి వృత్తీ, వ్యాపకం. ఇప్పటి వరకు పన్నెండు పుస్తకాలు రచించి, ప్రచురించాడు. తాను రచించిన కథనాలను మిత్రుల సహాయంతో 'సామాన్యశాస్త్రం' పేరిట ప్రచురించి పాఠకుల సౌలభ్యంకోసం తక్కువ ధరకు అందించడం వీరి ప్రత్యేకత. ఇతడి పుస్తకాల్లో 'కోళ్లమంగారం మరికొందరు' సుప్రసిద్ధం. ప్రస్తుతం రమేష్‌బాబు మనదేశంలోని సామాన్యతను అసామాన్యంగా తన ఛాయచిత్రాలద్వారా ప్రదర్శిస్తున్న ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రఘురాయ్‌పై 'సత్యం, శివం, సుందరం' అనే పుస్తకం వ్రాస్తున్నాడు. భార్య సుమబాల కూడా జర్నలిస్టే. కూతురు సెలవు ఏడో తరగతి చదువుతోంది. వీరి నివాసం హైదరాబాద్.

Preview download free pdf of this Telugu book is available at Batikina kodi