-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
బస్తర్ త్రోవలో (free)
Bastar Trovalo - free
Author: Dasaradh
Publisher: Self Published on Kinige
Pages: 37Language: Telugu
చత్తిస్ ఘడ్ రాష్త్రంలో సగానికిపైగా అడవులే. విశాలంగా ఆవరించి ఉన్న ఈ అడవి భూబాగం అనేక జలపాతాలు, గుహలు , ప్రాఛీన కట్టడాలతో నిండి ఉంది. అరుదైన అనేక రకాల పక్షులకు, కృరమృగాలకు ఆలవాలం ఈ ప్రాంతం. జగదల్పూర్ జిల్లా కేంధ్రం. ఆదివాసీలు / గిరిజనులు ఎక్కువగా నివసించే దండకారణ్య ప్రాంతంలో ఉన్న ప్రధాన పట్టణాలలో ముఖ్యమైనది. ఈ పట్టణానికి దక్షణంగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందూర్ దగ్గర చిన్న కుగ్రామం చోటీకవాలి. ఈ ఊర్లోనే రిజ్వీ నాకోసం హొమ్ స్టే ఎర్పాట్లు చేసాడు. ఇదే స్థావరంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న కుగ్రామాలను కలయతిరగడానికి, ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్లు దక్షణంగా దట్టమైన అడవి మద్యలో ఉన్న గుడియా పడవ్ లో జరగబోయే ఆదివాసీ పెళ్లి చూసిరావడానికీ, వివిద ప్రధేశాలలో వారంవారం జరిగే సంతలను చూడడానికి ఆరు రోజుల ప్రణాళిక వేసుకున్నా. నిజానికి, ఆ గ్రామాలలోనే ఆదివాసీలతో కలిసి కొన్నాళ్ళు ఉండిపోవాలనేది నా ఆశ. ఆదివాసీలకు సానుకూలంగా ఉండి వాళ్ళ బాషే మాట్లాడగలిగే స్థానికులెవరైనా ఉంటేగాని అది వీలుకాదు. నాకు హోమ్ స్టే వసతి ఎర్పాటు చేసిన షకీల్ రిజ్వీ ఒక సాంఘీక కార్యకర్త. ఇతను ఆసక్తి ఉన్న బస్తర్ ప్రయాణీకులకు చాలా సహాయకారి. ఇతన్ని ghanasar@gmail.com లో సంప్రదించవచ్చు.
- దశరధ్
Nice description of the life of adivasis.
Thank you for sharing your experiences