-
-
బలి కోరిన వజ్రాలు
Bali Korina Vajralu
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 71Language: Telugu
రిచ్‌గా వున్న ఆ డబల్ రూమ్‌ని పరిశీలిస్తున్నాడు అతడు.
“మోహన్.. ఆహూటల్లో పరుపుమీద నుంచి తీసి చేబులో వేసుకున్నావే, అదేమిటి?" అని ప్రశ్నించింది నీలవేణి.
నైట్ డ్రెస్‌లో ఉన్న అతడు చిన్నగా నవ్వి “చూశావా?" అన్నాడు. కబోర్డ్ తెరిచి హేంగర్‌కి ఉన్న పాంటుజేబులోంచి ముఖమల్ సంచి తీసి, దాని ముడి విప్పాడు. అందులో ఉన్న వజ్రాలను ఆమె అరచేతిలో వేశాడు.
ఆనందంగా వాటిని చూస్తూ “ఎంత ముచ్చటగా ఉన్నాయి! అవునూ... అక్కడికి మళ్ళీ వెళ్లి వీటిని తెచ్చావా?" అని ప్రశ్నించింది.
“అవును"
“ఎందుకు తెచ్చావ్?"
“కొన్ని డేగలు వీటికోసం మన చుట్టూ తిరుగుతున్నాయి కదా! ఈ వజ్రాలను ఎలా ఎగరేసుకుపోతాయో చూడాలని తెచ్చాను!"
“అవునూ... ఆ హోటల్ రూమ్‌ని చిందర వందర చేసిన కోబ్రా అనుచరులు అల్మారాలో ఉన్న మన క్యాష్ ముట్టుకోలేదు, ఎందుకు?"
“వజ్రాలు తప్ప మరేమీ ముట్టుకోవద్దని వాళ్ల బాస్ చెప్పి ఉండొచ్చు... వందల కోట్ల ముందు లక్షలు కనిపిస్తాయా?" అంటూండగానే కాలింగ్ బెల్ మోగింది.
నీలవేణి వెళ్లి తలుపు తీసింది.
వజ్రాలు ఎక్కడైనా బలి కోరతాయా?
ఆద్యంతం పట్టువిడవకుండా పరుగులు తీయించే థ్రిల్లర్
బలి కోరిన వజ్రాలు.
సస్పెన్స్ తో పరుగులు తీయిస్తూ ఉత్కంఠకలిగించే కథనంతో అపరాధపరిశోధన నవల రాయడం కత్తిమీద సాము లాంటిది.బలికోరిన వజ్రాలు నవల ఆద్యంతం ఒకేవిధమైన టెంపోతో పాఠకులను తనవెంట తీసుకువెళ్తుంది.అడపా చిరంజీవి తనశైలితో మరోసారి పాఠకులను ట్రెజర్ హంట్ కు తీసుకువెళ్లాడు.
Excellent novel
నిన్నటి రోజు' బలి కోరిన వజ్రాలు' చదివాను. ఇలాంటి నవలలు చదువుతుంటే చిన్నప్పుడు చందమామ లోని కథలు చవిన ఫీలింగ్ కలుగుతుంది. మనిషి స్వార్థం గురించి ఈ నవలలో చాలా చక్కగా చెప్పారు. వజ్రాల మీద వ్యామోహం తో మనుషులని మనుషులే చంపడం జరుగుతుంది తప్ప, వజ్రాలు మాత్రం మనుషుల్ని చంపవు అన్నట్టు చెప్పారు. ఇందులో సస్పెన్స్ ఎక్కువుగా లేకపోయినా నవల మొత్తం ఒకేసారి చదవాలన్న ఇంట్రెస్ట్ కల్గుతుంది. ఇది మంచి కాలక్షేపపు నవల. అందులో అనుమానం లేదు. ఇలాంటివి రోజుకొక నవల చదవాలనిపిస్తుంది. thank you అడపా చిరంజీవి గారు. మీ నుండి మరో జానపద నవల కోసం ఎదురుచూవుంటాను.
గాంధీ మనోహర్
ఫిల్మ్ డైరెక్టర్
అడపా చిరంజీవి గారి వజ్రాల వేట చాలా బావుంది. మానవతా విలువలు పూర్తి గా తగ్గి పోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పుస్తకం మనలో మానవత్వాన్ని తట్టి లేపుతుంది.ఇలాంటి మంచి పుస్తకాన్ని వ్రాసిన చిరంజీవి గారికి అభినందనలు.
అడపా చిరంజీవి గారు! మీ నవల “బలికోరిన వజ్రాలు” కినిగే లో వచ్చినట్టు ఇందాకే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళల్లో ఒకతను తను నవల చదివేసి కథేంటో చెప్పబోతే ‘వద్దు నేను చదువుతాను నువ్వు చెప్పేస్తే నాకు థ్రిల్లు వుండదు’ అని అన్నాడు..
“తప్పకుండా చదువు ఇప్పుడు వచ్చే చాలా సినిమాల కంటే ఈ నవల చాలా ఇంటరెస్టింగ్ గా వుందని చాలా కాన్ఫిడెంట్ గా అతను చెప్పాడు. మీరు మీ నవలను చదివే రీడర్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయరు. మా ఫ్రెండ్స్ అందరూ ఇదే మాట అంటుంటారు. ఇందాకే నవల కొన్నాను.వీలు చూసుకుని చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను.
గాంధీ మనోహర్
ఫిల్మ్ డైరెక్టర్.