• Balalaku Bangarubata
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలలకు బంగారుబాట

    Balalaku Bangarubata

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 171
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగుభాషలో వ్యక్తిత్వ వికాస పుస్తకాల కోవలో పిల్లల కోసం వస్తున్న పుస్తకాలు తక్కువగానే వున్నాయి. డా. టి. యస్. రావుగారు బాలల్లో వ్యక్తిత్వ వికాసం, వారి మానసిక సమస్యల అవగాహనపై కొన్ని మంచి పుస్తకాలను రచించారు. "బాలలకు బంగారుబాట", ఆ కోవలో ప్రత్యేకమైనదిగా నేను భావిస్తున్నాను.

ఇటు తల్లిదండ్రులకు, అటు పిల్లల్కు ఉపయోగపడే పుస్తకంగా డా. టి.యస్. రావు దీన్ని మన ముందుకు తీసుకువచ్చారు. ఇందులోని అంశాలను పిల్లలకు వివరించి చెప్పేందుకు తల్లిదండ్రులు చదవాలి. ప్రతీ రోజూ ఒక అధ్యాయం చొప్పున పిల్లలతో చదివించాలి.

ఈ పుస్తకంలో కంఠస్తం చేయగల్గిన పద్యాలు, పాటలు వంటివి ఉన్నాయి. భారత జాతి చరిత్రలో మహనీయులైన వారి జీవిత చిత్రణలున్నాయి. కొన్ని గుర్తుపెట్టుకోదగిన పలుకుబడులు (కొటేషన్లు) వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఈ పుస్తకం పదేపదే చదువుకునేలా చేస్తాయి. మీ పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని కలుగజేస్తాయి. జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో, ఏది మంచి సమాజాన్ని నిర్మించేందుకు పునాది అవుతుందో అదంతా ఇందులో వివరంగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పిల్లలను తీర్చిదిద్దేలా, పదికాలాల పాటు దాచిపెట్టుకునేలా ఈ పుస్తకాన్ని రచించిన మిత్రుడు టి. యస్. రావును అభినందిస్తున్నాను.

- డా. జి. సమరం

గమనిక: "బాలలకు బంగారుబాట" ఈబుక్ సైజ్ 20.6 mb

Preview download free pdf of this Telugu book is available at Balalaku Bangarubata