• Balala Samudra Sastram 3
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బాలల సముద్రశాస్త్రం 3

  Balala Samudra Sastram 3

  Pages: 120
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సముద్రం - అనే మాటే పిల్లల మదిలో ఉల్లాసపుటలలు ఉప్పొంగేలా చేస్తుంది. పై నుండి పడే చినుకులు... పల్లానికి ప్రవహించే నీరు... నిలకడగా ఉన్న నీరు... మొత్తంగా నీరు ఏ స్థితిలో ఉన్నాపిల్లలకు ఆహ్లాదాన్నికల్గిస్తాయి. కనుచూపు మేరంతా నీరే కనిపించే అద్భుత దృశ్యం పిల్లల్లో ఆనంద పారవశ్యం కల్గించగ మానదు. ఆ మాటకొస్తే పిల్లలకు మాత్రమే సముద్రమంటే ఇష్టమా! అంటే పెద్దలు వెంటనే సముద్ర తీరంలో కూర్చొని అలలను ఆహ్వానించడమంటే మాకు కూడా చాలా ఇష్టమే అంటారు. ఇలా పిల్లలను పెద్దలను అపరిమితంగా ఆకట్టుకునే అపురూప సుందర సువిశాల దృశ్యం సముద్రం. సముద్ర తీరంలోని ఇసుకలో కూర్చొని ఉరుకులు పరుగులతో నురగలు కక్కుతూ వచ్చే అలలు తమ పాదాలను తాకి తిరిగివెళ్ళేటప్పుడు వాటి తలలను నిమరాలంటే ఎవరికిష్టముండదు. హృదయ వైశాల్యాన్ని ఒక్క సారిగా రెండింతలు చేసే హుషారును కల్గించే ఈ అలల వెనక దాగిన రహస్యాలను తెలుసుకోవడం కూడా మనందరికీ చాలా ఇష్టమే. అందరి కోసం సముద్రశాస్త్రాన్ని పాయలు పాయలుగా విడగొట్టి గోరుముద్దలుగా మార్చి అల్లారు ముద్దుగా నోటి కందించే ప్రయత్నం చేస్తున్న డా.యం.పి.మద్దులేటి రెడ్డి గారి కృషి తప్పకుండా ఫలప్రదమవుతుంది.

సముద్రశాస్త్రం మూడవ భాగంలో ఉత్తర హిందూమహాసముద్రం, అరేబియాసముద్రం, బంగాళాఖాతాలలో అలల ఎత్తు వివరాలు అలల వక్రీభవనం, విచ్ఛిన్నత ప్రేరేపించు ప్రవాహాలు తదితర అంశాలను చక్కని చిత్రాలలో వివరించారు.

ముఖ్యంగా 2004 లో ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన ‘సునామీ’ల గురించిన సమగ్ర సమాచారాన్ని డా.యం.పి.మద్దులేటి రెడ్డిగారు ఈ పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయం. సునామీలు ఏర్పడే విధానం, హెచ్చరిక ప్రక్రియ - చాలా ఆసక్తికరంగా ఈ పుస్తకంలో వివరించారు. దశాబ్దకాలం గడిచినా ( ఈ పుస్తక రచన కంటే ముందు) ఇంకా అందరి మదిలో సునామీ సృష్టించిన ప్రకంపనాలు తాజాగా ఉన్నాయి. సముద్రపు లోయల్లో అంతర్భాగంలో ఏర్పడే భూకంపమే సునామీగా మారితే అది ఎంత ప్రమాదకరంగా జనావాసాలపై పంజా విసురుతుందో ఈ పుస్తకంలోని సునామీల వివరాలు స్పష్టం చేస్తాయి.

సముద్రశాస్త్ర అధ్యయనానికి అనువైన నౌకలు, ఎకోసాండర్, సముద్ర నీటిలవణీయత, సముద్ర ప్రవాహాలను కొలచు సాధానాల గురించి, ముఖ్యంగా పోటు, పాట్లు; వీటిని కొలుచు సాధనాల గురించి ఈ పుస్తకంలో బొమ్మలతో సహా వివరించడం జరిగింది. సముద్రపుటడగున ఉన్న నిక్షేపాలు, వాటిని సేకరించు సాధనాల గురించి వివరించడంతో మొత్తంగా పాఠకులు సముద్రమంతా ఒక్కసారిగా కలియతిరిగినట్లుగా ఉంటుంది. అందరు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి అంతర్భాగంలోని అలలను, నిక్షేపాలను దర్శించినట్లుగా ఉండే ఈ పుస్తకం చరిత్రలో ఒక అత్యవసర పఠనీయ పుస్తకంగా మిగిలిపోతుంది.

- యస్.యండి.ఇనాయతుల్లా

గమనిక: " బాలల సముద్రశాస్త్రం 3 " ఈబుక్ సైజు 6mb

Preview download free pdf of this Telugu book is available at Balala Samudra Sastram 3