-
-
బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనల సంకలనాలు-3
Balabandhu B V NarasimhaRao Sampurna Rachanala Sankalanalu 3
Author: B.V. Narasimha Rao
Publisher: Devineni Seetaravamma Foundation
Pages: 276Language: Telugu
బాలబంధు బి.వి. నరసింహారావు గారి సంపూర్ణ రచనల సంకలనాల మూడవ భాగం ఈ-బుక్ ఇది.
మొదటి భాగం ఈ-బుక్ ఇక్కడ.
రెండవ భాగం ఈ-బుక్ ఇక్కడ .
బాలబంధు బి.వి. నరసింహారావు గారి సమగ్ర సాహిత్యం మూడు భాగాలు కలసిన ఈ-బుక్ ఇక్కడ.
* * *
బాలబంధు బి.వి. సమగ్ర సాహిత్యం ముద్రించాలనే ప్రయత్నంలో వారి జీవన రేఖలు, గేయాలు, కథలు, వ్యాకరణం అన్నీ కలిపి 30పైగా ఉన్నట్లు తెలుసుకొని, ప్రయత్నం చేయగా, మూడు రచనలు మున్నీగీతాలు, ఋతుగీతాలు, ముద్దుబిడ్డ కథలు తప్ప మిగతావన్నీ అందుబాటులోకి వచ్చాయి. వీటిని మూడు భాగాలుగా విభజించాము.
మొదటి భాగము: జీవనరేఖలు, బి.వి. వ్యాసాలు, బివి గురించి మిత్రుల క్రొత్త వ్యాసాలు, చలంతో లేఖలు (సంజీవ్‌దేవ్ గారి ముందు మాట)
రెండవ భాగము: కథలు, గేయాలు, గేయనాటికలు
మూడవ భాగము: బాల వాఙ్మయం, పద విపంచి, ఆంధ్రపదావళి, అమృతాంశువులు
బాల సాహిత్యం రచనలవారీగా సమగ్రంగా లేని లోపాన్ని ఈ మూడు భాగాలు తీర్చుతాయనుకుంటాను. ముందు తరాలకు తెలుగు భాష అభివృద్ధికి ఈ సంపుటాలు ఉపయోగపడాలని మా ప్రయత్నం. ఒక జీవితకాలపర్యంతం పిల్లల గురించే కలవరించి, పలవరించిన మానవీయులు బి.వి. వారి రచనలు కాలగర్భంలో కలసిపోకుండా అక్షరాల వెనుక అంతరంగాన్నిఆవిష్కరించడమే మేం చేస్తున్న పని.
- దేవినేని మధుసూదనరావు
(దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్)

- ₹450
- ₹216
- ₹216
- ₹216
- FREE
- ₹450
- ₹216
- ₹216
- ₹216